Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తుల స్నానాలు.. నదిలో పెరిగిన మల కోలిఫాం బ్యాక్టీరియా-maha kumbh 2025 prayagraj river water fails bathing quality standards cpcb finds high faecal coliform levels see details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తుల స్నానాలు.. నదిలో పెరిగిన మల కోలిఫాం బ్యాక్టీరియా

Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తుల స్నానాలు.. నదిలో పెరిగిన మల కోలిఫాం బ్యాక్టీరియా

Published Feb 18, 2025 04:22 PM IST Anand Sai
Published Feb 18, 2025 04:22 PM IST

  • Maha Kumbh 2025 : ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా సందర్భంగా 50 కోట్లకు పైగా ప్రజలు నదిలో స్నానమాచరించారు. అయితే ప్రయాగ్‌రాజ్‌లోని జలాలు స్నానానికి అనువుగా లేవని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.

మహా కుంభమేళాలో పుణ్యస్నానాల కోసం ప్రయాగరాజ్‌కు కోట్లాది మంది భక్తులు వెళ్లారు. ఇంకా స్నానాల కోసం వెళ్తూనే ఉన్నారు. కానీ ప్రయాగరాజ్‌లోని గంగానది స్నానం చేయడానికి అనుకూలం కాదని కేంద్ర ప్రభుత్వ నివేదిక పేర్కొంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం, గంగలో ఫెకల్ కోలిఫాం బ్యాక్టీరియా స్థాయి చాలా ఎక్కువగా ఉంది.

(1 / 4)

(Ravi Prakash)

నివేదిక ప్రకారం, గత జనవరి 12-13 తేదీలలో ప్రయాగరాజ్‌లోని మహా కుంభమేళాలో నది జలాలను పరీక్షించారు. ఆ జలం స్నానం చేయడానికి అనుకూలం కాదని తేలింది. అందులో మల కోలిఫాం బ్యాక్టీరియా స్థాయి చాలా ఎక్కువగా ఉంది. ఈ బ్యాక్టీరియా మానవులు, జంతువుల మలంలో ఉంటుంది. మరికొన్ని రోజుల్లో భక్తుల రద్దీ కారణంగా జలంలో బ్యాక్టీరియా స్థాయి మరింత పెరగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.

(2 / 4)

ఈ నివేదిక నేపథ్యంలో యోగి ప్రభుత్వ అధికారులకు పర్యావరణ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వర్చువల్‌గా న్యాయస్థానంలో హాజరు కావాలి. నదిలో కాలుష్య స్థాయిని తగ్గించడానికి ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఏ చర్యలు తీసుకుంటోందో న్యాయస్థానం తెలుసుకోవాలనుకుంటోంది.

(3 / 4)

(PTI)

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఉత్తరప్రదేశ్ పర్యావరణ అధికారులను ఈ నివేదికపై వివరణ ఇవ్వమని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణాత్మక నివేదికను సమర్పించమని ముందుగానే ఆదేశించింది. కానీ వారు జల నమూనాల పరీక్ష నివేదికను మాత్రమే సమర్పించారు. దీంతో మళ్ళీ నివేదికను కోరింది.

(4 / 4)

(ANI)

Anand Sai

eMail
WhatsApp channel

ఇతర గ్యాలరీలు