Ludhiana gas leak: గ్యాస్ లీక్ ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య.. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Ludhiana gas leak: పంజాబ్ రాష్ట్రం లూథియానాలోని గియాస్‍పురా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి ఆదివారం ప్రమాదకరమైన గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరికొందరు అనారోగ్యం బారిన పడ్డారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను ఎన్‍డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు తరలిస్తున్నారు.
(1 / 6)
గ్యాస్ లీక్ ఘటన తర్వాత గియాస్‍పుర, సువా రోడ్ ప్రాంతాలను పోలీసులు సీల్ చేశారు. అక్కడి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
(HT Photo)(2 / 6)
లూథియానాలో గ్యాస్ లీక్ ఘటన జరిగిన ప్రాంతానికి చేరిన ఓ అంబులెన్స్ ఇది. ఆ ప్రాంతంలోని ప్రజలను ఎన్‍డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.
(HT Photo)(3 / 6)
గియాస్‍పురా ప్రాంతంలోని సువా రోడ్ సమీపంలో గ్యాస్ లీక్ ఘటన తర్వాత ఎన్‍డీఆర్ఎఫ్, పోలీసు సిబ్బంది, వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. “పోలీస్, ప్రభుత్వం, ఎన్‍డీఆర్ఎఫ్ టీమ్స్.. ఘటనా స్థలంలో ఉన్నాయి. ప్రభావితమైన వారికి సాధ్యమైన సాయమంతా అందిస్తాం” అని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ట్వీట్ చేశారు.
(HT Photo)(4 / 6)
గ్యాస్ లీక్ ఘటనలో తమ ఆప్తులను దూరం చేసుకున్న వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. మృతుల కుటుంబాలకు చెరో రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియాను పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. అనారోగ్యం బారిన పడిన వారికి రూ.50వేల చొప్పున సాయాన్ని అందించనున్నట్టు వెల్లడించింది.
(HT Photo)(5 / 6)
లుథియానాలో జరిగిన గ్యాస్ లీక్ ఘటన కారణంగా అనారోగ్యానికి గురైన వ్యక్తికి డాక్టర్ చికిత్స అందిస్తున్న దృశ్యమిది.
(HT Photo / Gurpreet Singh)ఇతర గ్యాలరీలు