18ఏళ్ల తర్వాత మీన రాశిలో రాహు, బుధుడి కలయిక.. ఈ రాశుల వారికి భారీ ధన లాభం!
- 18ఏళ్ల తర్వాత మీన రాశిలో రాహు, బుధుడి కలయిక జరగనుంది. ఫలితంగా.. పలు రాశుల వారికి భారీ ధన లాభం చేకూరనుంది.
- 18ఏళ్ల తర్వాత మీన రాశిలో రాహు, బుధుడి కలయిక జరగనుంది. ఫలితంగా.. పలు రాశుల వారికి భారీ ధన లాభం చేకూరనుంది.
(1 / 5)
రాహువు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు. మార్చ్ 7న బుధుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. 2006 తర్వాత తొలిసారి.. మీన రాశిలో రాహువు, బుధుడి కలయిక జరగనుంది. ఫలితంగా పలు రాశుల వారికి మంచి చేకూరనుంది.
(2 / 5)
మీన రాశిలో రాహువు, బుధుడి కలయిక వృషభ రాశి వారికి సానుకూలంగా ఉండనుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. మంచి లాభాలు చూస్తారు. దీర్ఘకాలంగా ఉన్న కష్టాలు తొలగిపోతాయి. సమస్యలు దూరమవుతాయి. గతంలో చేసిన పెట్టుబడులు.. ఇప్పుడు మంచి రిటర్నులు ఇస్తాయి.
(3 / 5)
కర్కాటక రాశి వారికి అంతా మంచే జరగనుంది. విదేశాల్లో చదువుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి గుడ్ న్యూస్ అందుతుంది. ఆధ్యాత్మిక పర్యటనలు చేపడతారు. డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా సాగుతూ వస్తున్న సమస్యలు దూరమవుతాయి.
(4 / 5)
మీన రాశిలో రాహువు, బుధుడి కలయికతో వృశ్చిక రాశి వారికి మంచి చేకూరుతుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి. ప్రేమ పెరుగుతుంది. మీ ఆలోచనలు సరిగ్గా ఉంటే, కచ్చితంగా విజయం సాధిస్తారు. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కానీ అందరిని నమ్మకూడదు!(Freepik)
ఇతర గ్యాలరీలు