(1 / 5)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రస్తుతం కర్కాటక రాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. అయితే, జూలై 31వ తేదీన తన రాశిని మార్చుకోనున్నాడు. జూలై 31న సింహ రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు.
(2 / 5)
సూర్యుడి రాశి అయిన సింహంలోకి శుక్రుడు అడుగుపెట్టనుండటం రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. జూలై 31వ తేదీ మధ్యాహ్నం సుమారు 2.15 నిమిషాలకు సింహంలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. ఆగస్టు 25 వరకు ఆ రాశిలో సంచరిస్తాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి సమయం కలిసి వచ్చి.. ప్రయోజనాలు దక్కుతాయి.
(3 / 5)
కర్కాటకం: సింహ రాశిలో శుక్రుడి సంచారం వల్ల కర్కాటక రాశి వారికి మంచి జరుగుతుంది. ఈ కాలంలో వీరి ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. సంపద మెరుగవుతుంది. ఉద్యోగస్తులు పదోన్నతి పొందొచ్చు. వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ముందు కంటే మెరుగవుతుంది. సుదీర్ఘంగా ఉన్న సమస్యలు కొన్ని పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.
(4 / 5)
సింహం: ఈ కాలంలో సింహ రాశి వారికి శుభం కలుగుతుంది. వారివారి రంగాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్యాలను చేరుకునేందుకు సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశాలు ఉంటాయి. నూతన ఆదాయ మార్గాలను కనుగొనే అవకాశాలు ఉంటాయి.
(5 / 5)
కుంభం: సింహ రాశిలో శుక్రుడి సంచార కాలం కుంభ రాశి వారికి కలిసి వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉన్నత విద్య చదువుతున్న వారికి ఫలితాలు బాగుంటాయి. వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడం పెరుగుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించాలి)
ఇతర గ్యాలరీలు