(1 / 5)
జులైలో గురు భగవానుడు ఉదయిస్తాడు. 12 సంవత్సరాల తరువాత, బృహస్పతి మిధున రాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ధనలక్ష్మీ రాజ యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం అన్ని రాశుల్లో కనిపిస్తుంది. అయితే 4 రాశుల వారికి సంపద విపరీతంగా పెరుగుతుంది. దీనితో ఆకస్మిక ధనలాభం, అదృష్టం పెరిగే అవకాశం ఉంది. ఈ అదృష్ట రాశుల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
(2 / 5)
తులా రాశి వారికి ధనలక్ష్మీ రాజయోగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాజయోగం మీ రాశి నుం;f తొమ్మిదవ ఇంట్లో ఏర్పడబోతోంది.ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులు తమ పై అధికారులతో, సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వ్యాపారాభివృద్ధికి సువర్ణావకాశాలు ఉంటాయి. వివాహితులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అవివాహితులు వివాహ ప్రతిపాదనలు చేస్తారు. పనిలో ప్రయోజనాలు పొందవచ్చు.
(3 / 5)
కన్య రాశి వారికి ధనలక్ష్మీ రాజ యోగం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే గురు గ్రహం మీ రాశి నుంచి పదొవ స్థానంలో సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు ఉద్యోగం, వృత్తిలో మంచి పురోగతిని పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. జీవితంలో ఆనందం పెరుగుతుంది. కార్యాలయంలో గౌరవం, ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. కొత్త సంబంధాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
(Pixabay)(4 / 5)
ధనలక్ష్మీ రాజయోగం మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాజయోగం మీ రాశికి చెందిన నాల్గొవ ఇంట్లో జరుగుతుంది. ఈ సమయంలో మీరు భౌతిక సుఖాలను ఆస్వాదిస్తారు. వాహనం లేదా ఆస్తి కొనుగోలు గురించి ఆలోచిస్తారు. బృహస్పతి ప్రభావం వల్ల విద్యా, కళాత్మక లేదా సృజనాత్మక రంగాలకు చెందిన వ్యక్తులు ప్రత్యేక విజయాలను పొందే అవకాశం ఉంది.
(5 / 5)
సింహ రాశి వారికి గురు భగవానుడి సంచారం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురుగ్రహం మీ ఆదాయంలో ఉన్నతంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు వృత్తిలో పురోభివృద్ధి, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. దీనివల్ల మీరు మీ పనిలో చాలా సంతోషంగా ఉంటారు. పెట్టుబడుల నుంచి లాభం పొందే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు