(1 / 6)
జులైలో శని మీన రాశిలో 30 సంవత్సరాల తరువాత తిరోగమనం చెందుతుంది. మరోవైపు, కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల కదలికలో మార్పు కొన్ని రాశుల వారి అదృష్టాన్ని తీసుకురానుంది. సంపద విపరీతంగా పెరుగుతుంది. ఆ రాశుల వివరాలు..
(2 / 6)
ధనస్సు రాశి వారికి కుజ, శని సంచారం కలిసి వస్తుంది. కుజుడు మీ రాశి కర్మ స్థితిలో సంచరిస్తున్నారు. మీ జాతకంలోని నాల్గొవ స్థానంలో శని తిరోగమనంలో ఉన్నాడు. ఈ సమయంలో మీరు పనిలో, వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
(3 / 6)
మకర రాశి వారికి కుజ, శని సంచారంలో మార్పు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శని మీ రాశి నుంచి మూడొవ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. మీ జాతకంలో కుజుడు లక్కీ హౌస్లోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ధైర్యం పెరుగుతుంది. మీరు పని లేదా వ్యాపారం కోసం ప్రయాణాలు చేయవచ్చు. ఈ సమయంలో మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. ఈ సమయంలో మీరు జీవితంలో అనేక ప్రణాళికాబద్ధమైన పనులు జరిగే అవకాశం ఉంది.
(4 / 6)
కుజుడు కుంభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తాడు. ఈ గ్రహాలు మీ శ్రమకు తగిన ప్రతిఫలం పొందడానికి సహాయపడతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. తల్లిదండ్రులు తమ సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.
(5 / 6)
మీన రాశి వారికి శని తిరోగమనం, కుజ సంచారం అనుకూలంగా ఉంటుంది. శని మీ లగ్నంలో సంచరిస్తాడు. కుజుడు ఏడో ఇంట్లో సంచరిస్తాడు. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది సరైన సమయం. వివాహితులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారు.
(6 / 6)
ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. వివిధ రాశులపై కుజ, శని గ్రహాల సంచార ప్రభావం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
ఇతర గ్యాలరీలు