(1 / 5)
ప్రశాంతత, సంపద, ఆనందాన్ని ప్రసాదించే శుక్రుడు శనివారం రాశిని మార్చుకోబోతున్నాడు. మే 31, 2025 శనివారం ఉదయం 11:42 గంటలకు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. కానీ కొన్ని రాశులకు చాలా మంచి చేస్తుంది. శుక్రుడి సంచారంతో లాభపడే రాశుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
(2 / 5)
మేష రాశిలో శుక్రుడి సంచారం వల్ల ధనుస్సు రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. వ్యాపారస్తులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి.
(3 / 5)
మేష రాశి వారికి శుక్ర సంచారం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి ఆశీస్సులతో మేష రాశి వారికి వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. భారీ ధన లాభం పొందే అవకాశం ఉంది.
(4 / 5)
కర్కాటక రాశి వారికి శుక్రుడి సంచారం చాలా ప్రయోజనకరంగా, లాభదాయకంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉండబోతోంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది.
(5 / 5)
ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. మేష రాశిలో శుక్రుడి సంచారం నేపథ్యంలో వివిధ గ్రహాలపై ప్రభావానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
ఇతర గ్యాలరీలు