తెలుగు న్యూస్ / ఫోటో /
శని తిరోగమనం ప్రారంభం.. ఈ రాశుల వారికి అదృష్టం.. ధనం, సంతోషం!
Shani Retrograde 2024: శని తిరోగమనం ప్రారంభమైంది. సుమారు నాలుగున్నర నెలలు ఇది సాగనుంది. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసివస్తుంది.
(1 / 5)
వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం, కర్మ ఫలదాత శని సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శని ప్రభావం చాలా ముఖ్యమైనది. నేడు (జూన్ 30) కుంభ రాశిలో శని తిరోగమనం ప్రారంభమైంది.
(2 / 5)
నేటి అర్ధరాత్రి (జూన్ 30) నుంచి నవంబర్ 15వ తేదీ సాయంత్రం వరకు కుంభ రాశిలో శని తిరోగమన స్థితిలో సంచరిస్తాడు. ఈ శని తిరోగమన కాలంలో కొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చి లాభాలు పొందుతారు.
(3 / 5)
కుంభం: శని తిరోగమనం కుంభ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ కాలంలో డబ్బు సంబంధితమైన పనులు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పనిలో అయినా ఉత్సాహంగా, ఆసక్తిగా పాల్గొంటారు. డబ్బు పొదుపు కూడా అధికమవుతుంది. భాగస్వామితో సంతోషం కూడా పెరుగుతుంది.
(4 / 5)
వృషభం: ఈ కాలంలో వృత్తి, వ్యాపారాల్లో వృషభ రాశి వారికి భారీగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. డబ్బు ఆదా విషయంలో మెరుగవుతారు. మునుపటి కంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. యువత చేపట్టే కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. వ్యాపారం చేసే వారికి అన్ని విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది.
(5 / 5)
మేషం: కుంభంలో శని తిరోగమనం మేష రాశి వారికి కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరికి ఆదాయం పెరగటంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు కూడా దొరకొచ్చు. దీంతో ఆర్థికంగా మేలు జరుగుతుంది. అదృష్టం ద్వారా కూడా ధనం సంపాదించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. వైవాహిక జీవితం కూడా మెరుగవుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ కథనం రూపొందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు)
ఇతర గ్యాలరీలు