ఈ మూడు రాశులకు సమయం కలిసి రానుంది.. ధనప్రాప్తి, సంతోషం సహా మరిన్ని ప్రయోజనాలు!
- సూర్యుడు, శని గ్రహాల ముఖాముఖి వల్ల సంసప్తక యోగం ఏర్పడనుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ఎక్కువగా కలిసి రానుంది. ఆ వివరాలు ఇవే..
- సూర్యుడు, శని గ్రహాల ముఖాముఖి వల్ల సంసప్తక యోగం ఏర్పడనుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ఎక్కువగా కలిసి రానుంది. ఆ వివరాలు ఇవే..
(1 / 5)
సూర్యుడు ఆగస్టు 16వ తేదీన తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ సమయంలో సూర్యుడు, శని ఒకదానికి ఒకటి ఎదురుపడనున్నాయి. కుంభరాశిలో ఉన్న శని, సింహరాశిలో సూర్యుడు 180 డిగ్రీల కోణంలో ముఖాముఖి ఉండనున్నారు. దీనివల్ల సంసప్తక యోగం ఏర్పడనుంది.
(2 / 5)
సంసప్తక యోగం వల్ల ఆగస్టు 16 నుంచి కొన్ని రాశుల వారికి బాగా కలిసి రానుంది. ధనం, గౌరవం, సంతోషంతో పాటు మరిన్ని లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. నెల రోజుల పాటు ఈ యోగం ఉండనుంది. ఈకాలంలో అదృష్టం పొందే రాశులు ఏవో ఇక్కడ చూడండి.
(3 / 5)
కుంభం: సంసప్తక యోగ కాలంలో కుంభ రాశి వారికి అదృష్టం కలిసి రానుంది. వీరికి ఆదారం బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రభావంతమైన వ్యక్తులను కలుస్తారు. ఎప్పటి నుంచో రావాల్సిన కొన్ని ప్రయోజనాలను పొందొచ్చు. ఈ కాలంలో వీరికి జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సత్ఫలితాలు ఉంటాయి.
(4 / 5)
వృషభం: ఈ యోగం వల్ల వృషభ రాశి వారికి మంచి సమయం ఉండనుంది. వీరికి ధనం ఎక్కువగా చేకూరే అవకాశాలు ఉన్నాయి. నూతన ఆదాయ మార్గాలు దొరికొచ్చు. చాలా కాలంగా ఏదైనా విషయం కోసం ప్రయత్నిస్తుంటే అది పూర్తవుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారం చేసే వారు విస్తరించే అవకాశాలు ఉంటాయి.
(5 / 5)
మకరం: సంసప్తక యోగం మకర రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ కాలంలో వీరికి ఆకస్మిక ధన లాభం చేకూరే అవకాశం ఉండనుంది. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా రావొచ్చు. ఉద్యోగులకు పెండింగ్‍లో ఉన్న పదోన్నతులు దక్కుతాయి. ముందు కంటే వీరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారాన్ని అందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, మరిన్ని వివరాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించాలి.)
ఇతర గ్యాలరీలు