రాహువు సంచారం: ఈ మూడు రాశుల కలిసి వచ్చే కాలమిది!
Rahu Transit 2024: ఉత్తర భాద్రపద నక్షత్రంలో రాహువు సంచరిస్తున్నాడు. సుమారు 8 నెలల పాటు ఇది ఉండనుంది. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వచ్చి.. ప్రయోజనాలు దక్కుతాయి.
(1 / 5)
రాహువు ప్రస్తుతం ఉత్తర భాద్రపద నక్షత్రంలో సంచరిస్తున్నాడు. జూలై 8వ తేదీన ఆ నక్షత్రంలో రాహువు ప్రవేశించాడు. 2025 మార్చి 16వ తేదీన వరకు ఆ నక్షత్రంలోనే సంచరిస్తాడు. ఇది చాలా రాశులపై ప్రభావాన్ని చూపుతోంది.
(2 / 5)
శనికి చెందిన ఉత్తర భాద్రపద నక్షత్రంలో రాహువు సంచరిస్తుండటం కొన్ని రాశుల వారికి కలిసి రానుంది. ఈ 8 నెలల కాలం వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉత్తర భాద్రపదంలో రాహువు సంచారం వల్ల ఏ రాశులు లాభపడతాయంటే..
(3 / 5)
మేషం: రాహువు సంచారం వల్ల రానున్న 8 నెలల్లో మేష రాశి వారికి కలిసి వస్తుంది. వీరికి వ్యాపారాల్లో భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదృష్టానికి తోడు కావాల్సిన వద్ద నుంచి మద్దతు కడా లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు కనుగొనవచ్చు. విదేశాల్లో భూములు, ఇళ్లు కొనాలనుకునే ప్రయత్నాలు చేసే వారికి ఎదురుచూపులు ఫలించే అవకాశం ఉంటుంది. కుటుంబంతో బంధం మరింత మెరుగవుతుంది.
(4 / 5)
కుంభం: ఈ కాలంలో కుంభ రాశి వారికి మేలు జరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలగవచ్చు. చాలా కాలం నుంచి రావాల్సిన ధనం తిరిగి పొందే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నత రావొచ్చు. గౌరవం పెరుగుతుంది. న్యాయపరమైన కేసుల్లో అనుకూలంగా ఉంటుంది.
(5 / 5)
కన్య: ఉత్తర భాద్రపదలో రాహువు సంచారం వల్ల కన్యా రాశి వారికి మేలు జరుగుతుంది. వీరికి ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది. లాభాలు, ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి ప్రయత్నాలకు మంచి ఫలితాలు దక్కుతాయి. ఒత్తిడి సమస్య నుంచి బయటపడతారు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారాన్ని రూపొందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు.)
ఇతర గ్యాలరీలు