రాజయోగాల ప్రభావం: గురు పూర్ణిమ రోజున ఈ మూడు రాశుల వారికి అదృష్టం!-lucky zodiac signs to get benefits on guru purnima 2024 due to rare raj yogs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రాజయోగాల ప్రభావం: గురు పూర్ణిమ రోజున ఈ మూడు రాశుల వారికి అదృష్టం!

రాజయోగాల ప్రభావం: గురు పూర్ణిమ రోజున ఈ మూడు రాశుల వారికి అదృష్టం!

Published Jul 17, 2024 06:28 PM IST Chatakonda Krishna Prakash
Published Jul 17, 2024 06:28 PM IST

Guru Purnima 2024: గురు పౌర్ణమి వేడుక జూలై 21వ తేదీన వచ్చింది. ఈ రోజున సర్వార్థ సిద్దియోగంతో పాటు మరిన్ని రాజయోగాల ప్రభావం వల్ల కొన్ని రాశులకు కలిసి వస్తుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

హిందూ పురాణాల ప్రకారం గురు పూర్ణిమ పర్వదినానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ వారంలోనే జూలై 21వ తేదీన గురు పూర్ణిమను జరుపుకోనున్నాం. ఆ రోజున కొన్ని శుభయోగాలు కూడా ఉన్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి కలిసి రానుంది. 

(1 / 5)

గురు పూర్ణిమ అయిన జూలై 21న సర్వార్థ సిద్ధి యోగం ఉంది. రాహువు, కేతువు, శని స్థానాల వల్ల శని రాజయోగం కూడా ఏర్పడుతుంది. కుబేర రాజయోగం, పాస్తక్ రాజయోగం కూడా ఉండున్నాయి. ఈ రాజయోగాల ప్రభావం వల్ల గురు పూర్ణిమ రోజున కొన్ని రాశుల వారికి అదృష్టం ఉండనుంది. ఆ రోజున ఏ రాశులకు మేలు జరుగుతుందో ఇక్కడ తెలుసుకోండి. 

(2 / 5)

వృషభం: గురు పూర్ణిమ రోజున వృషభ రాశి వారికి కలికి వస్తుంది. కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి. చేసే పనుల్లో మద్దతు దక్కుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మంచి సమయం మొదలయ్యే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం మెరుగవుతుంది.

(3 / 5)

సింహం: ఈ రోజున సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అనుకూలమైన వార్తలు వినే అవకాశం ఉంటుంది. మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడి వచ్చే ఛాన్స్ ఉంటుంది. చదువు పట్ల కూడా ఇప్పటి నుంచి ఆసక్తి పెరగొచ్చు. 

(4 / 5)

కుంభం: గురు పూర్ణిమ రోజున కుంభ రాశి వారికి ఆనందం కలుగుతుంది. చేసే పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఈ కాలం నుంచి వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి. ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చేసే పనులకు ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారం చేసే వారికి రాభాలు రావొచ్చు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారాన్ని రూపొందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు) 

(5 / 5)

ఇతర గ్యాలరీలు