Lucky Zodiac Signs: కృష్ణాష్టమి నుంచి ఈ రాశుల వారికి మెండుగా అదృష్టం.. సంపద, ప్రశంసలు సహా మరిన్ని లాభాలు!
Lucky Zodiac Signs: కర్కాటక రాశిలో బుధుడు ఉదయించనున్నాడు. కృష్ణాష్టమి రోజున ఇది మొదలుకానుంది. అప్పటి నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసి రానుంది.
(1 / 5)
జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాల రాకుమారుడైన బుధుడి సంచారం అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో తిరోగమన దిశలో సంచరిస్తున్న బుధుడు.. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజైన ఆగస్టు 26న ఆ రాశిలో ఉదయించనున్నాడు.
(2 / 5)
కర్కాటక రాశిలో బుధుడు ఉదయించడం వల్ల ఆగస్టు 26వ తేదీ నుంచి కొన్ని రాశులకు కలిసి రానుంది. డబ్బు, ప్రశంసలతో పాటు మరిన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఈ ప్రభావం సుమారు 12 రోజుల పాటు ఉంటుంది. కర్కాటకంలో బుధుడు ఉదయించడం వల్ల లాభపడే రాశులు ఏవంటే..
(3 / 5)
తులా: కర్కాటకంలో బుధుడు ఉదయించడం తులా రాశి వారికి కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరు చేసే పనులు ప్రశంసలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి ఆదాయం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు చేకూరే ఛాన్స్ ఉంటుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
(4 / 5)
మిథునం: ఈ కాలంలో వీరికి ఆకస్మిక సంపద దక్కే అవకాశాలు ఉంటాయి. కుటుంబంతో బంధం మెరుగుపడుతుంది. నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారాలను విస్తరించొచ్చు. లాభాలు పెరుగుతాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు పొందే ఛాన్స్ ఉంది.
(5 / 5)
కన్య: కర్కాటకంలో బుధుడు ఉదయించడం వల్ల కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వీరికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కెరీర్ పరంగా కలిసి వస్తుంది. జీతం పెరిగే అవకాశాలు ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు శుభవార్త వినే ఛాన్స్ ఉంది. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాలను తీర్చుకోవడం కోసం సంబంధిత నిపుణులను సంప్రదించొచ్చు.)
ఇతర గ్యాలరీలు