మాలికా రాజయోగం: ఈ మూడు రాశుల వారికి అదృష్టం.. చాలా ప్రయోజనాలు
Malika Rajyog 2024: మాలికా రాజయోగం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో లాభాలతో పాటు వ్యక్తిగతంగానూ ప్రయోజనాలు ఉంటాయి.
(1 / 5)
జ్యోతిష శాస్త్రం ప్రకారం, జూన్ 14వ తేదీన మిథున రాశిలోకి బుధుడు ప్రవేశించాడు. జూన్ 19వ తేదీ వరకు ఆ రాశిలోనే బుధుడు సంచరిస్తాడు. జూన్ 15న మిథున రాశిలోకి సూర్యుడు కూడా ప్రవేశించాడు. దీంతో మిథునంలో బుధాదిత్య రాజయోగం సహా మరిన్ని యోగాలు ఏర్పడ్డాయి. ఒకే వరుసలో ఏవైనా మూడు గ్రహాలు ఉంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం మాలికా రాజయోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం మిథున రాశిలో సూర్యుడు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. అందుకే ఈ యోగం ఏర్పడుతోంది.
(2 / 5)
జాతకంలో గ్రహాలు వరుసగా ఏడు స్థానాల్లో ఉండి మాలగా కనిపించినప్పుడు ఈ మాలికా రాజయోగాన్ని సూచిస్తుంది. మాల అనే పదం నుంచి ఈ మాలికా రాజయోగం ఉద్భవించింది. ఈ మాలికా రాజయోగం చాలా శక్తివంతమైనది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుతాయి.
(3 / 5)
మేషం: మాలికా రాజయోగం వల్ల మేషరాశి వారికి కలిసి వస్తుంది. వీరికి చాలా శుభదాయకంగా ఉంటుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. ఉన్నత విద్యను అభ్యసించే వారికి కలిసి వస్తుంది. భాగస్వామితో కలిసి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగం చేసే వారికి ప్రత్యేక ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యక్తిగత జీవితంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుంది.
(4 / 5)
మిథునం: ఈ రాజయోగం కాలంలో మిథున రాశి వారికి గౌరవం పెరుగుతుంది. కోర్టులో కేసులు ఏమైనా ఉంటే అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు సఫలం అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
(5 / 5)
సింహం: మాలిక రాజయోగ కాలంలో సింహ రాశి వారి కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు. కార్యాలయాల్లో వీరి పనికి ప్రశంసలు దక్కుతాయి. జీవితంలో కొత్త విలాసాలు లభించే అవకాశం ఉంటుంది. కుటుంబంలోని కొన్ని సమస్యలు పరిష్కారం కావొచ్చు. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగవుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ కథనం రూపకల్పన జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు.)
ఇతర గ్యాలరీలు