మరో రెండు రోజుల్లో శక్తివంతమైన రాజయోగం: ఈ రాశుల వారికి అదృష్టయోగం.. చాలా లాభాలు!
- నవపంచమ రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని మెండుగా తెచ్చిపెట్టనుంది. మరో రెండు రోజుల్లో ఇది ఏర్పడనుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
- నవపంచమ రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని మెండుగా తెచ్చిపెట్టనుంది. మరో రెండు రోజుల్లో ఇది ఏర్పడనుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
(1 / 5)
జ్యోతిషం ప్రకారం, కుజుడు శక్తివంతమైన గ్రహం. దీని సంచారం ప్రభావం రాశులపై అధికం. ప్రతీ 45 రోజులకు ఓసారి కుజుడు రాశి మారుతుంటాడు. ఈ క్రమంలో కొన్ని రాజయోగాలను కూడా సృష్టిస్తుంటాడు.
(2 / 5)
మరో రెండు రోజుల్లో అంటే జనవరి 13వ తేదీన కుజుడు, వరుణ గ్రహం వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడనుంది. జనవరి 13వ తేదీన తెల్లవారుజామున ఆ రెండు గ్రహాలు పరస్పరం 120 డిగ్రీల కోణంలోకి రానున్నాయి. దీంతో నవపంచమ రాజయోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం మెండుగా ఉండనుంది.
(Pixabay)(3 / 5)
కన్య: నవపంచమ రాజయోగం కన్యా రాశి వారికి ప్రయోజనకరం. చాలా విషయాల్లో లాభాలు దక్కే అవకాశాలు ఉంటాయి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. డబ్బు అంశంలో అదృష్టం కలుగుతుంది. కుటుంబంలోనూ సంతోషం ఉంటుంది.
(4 / 5)
తుల: ఈ యోగం వల్ల తుల రాశి వారికి శుభాలు కలుగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు చాలా విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. అదృష్టం మద్దతుగా ఉంటుంది. చేసే చాలా పనులు సక్సెస్ అవుతాయి. విజయాలు సిద్ధస్తాయి. మునుపటి కంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
(5 / 5)
కర్కాటకం: నవపంచమ రాజయోగం వల్ల కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. వీరికి అదృష్ట యోగం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనలాభాలు పెరిగే అవకాశాలు అధికం. వ్యక్తిగత జీవితంలో సంతోషం నెలకొంటుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)
ఇతర గ్యాలరీలు