Telangana Tourism : ప్రకృతి అందాలు,కొండల మధ్య స్పీడ్ బోటింగ్ - 'లక్నవరం' అందాలను చూసొద్దామా..!
- Laknavaram Lake Tour : ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం సరస్సు వరంగల్ సిటీ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ కొండలు, చెట్లు, వంతెన కింద నీళ్లు.. కోనసీమ, అరకు, కేరళ అనుభూతిని కలిగిస్తాయి. ఇటీవలే కురిసిన వర్షాలతో లక్నవరం పూర్తిస్థాయిలో నిండిపోయింది. పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

(1 / 6)
మేడారంలో వెళ్లే మార్గంలో ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం సరస్సు వరంగల్ సిటీ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.(image source from @tstdcofficial)
(2 / 6)
ములుగు గోవిందరావు పేట మండలం లోని బుస్సాపూర్ మీదుగా లక్నవరం చేరుకోవచ్చు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ చెరువును తవ్వించినట్లు చరిత్ర చెబుతోంది. చుట్టూ గుట్టల నడుమ ఉండే ఈ చెరువు ద్వీపాన్ని తలపిస్తుంది(image source from @tstdcofficial)
(3 / 6)
ఇక్కడ రెండు వైపులా ఏర్పాటు చేసిన వేలాడే వంతెనలు కేరళ వాతావరణాన్ని తలపిస్తాయి. చుట్టూ కొండలు, చెట్లు, వంతెన కింద నీళ్లు.. కోనసీమ, అరకు, కేరళ అనుభూతిని కలిగిస్తాయి
(4 / 6)
అంతేగాకుండా సరస్సులో బోటు షికారు, స్పీడ్ బోట్ తోపాటు సైక్లింగ్ బోటుతో పర్యాటకులు ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఉంది
(5 / 6)
ఎగువన కురుస్తున్న వర్షాలతో ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువైంది. దీంతో ఇక్కడి వేలాడే వంతెనల పైనుంచి సరస్సు అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఎంతటి ప్రయాణ భారాన్నైనా ఇక్కడి వాతావరణం ఇట్టే మాయం చేస్తుంది. చుట్టూ ఉన్న కొండకోనలు, చెట్లు, నీళ్లు, హరిత రిసార్ట్స్, ఇతర సదుపాయాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఇక్కడికి వెళ్లేందుకు పలు టూరిజం ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి.(image source from @tstdcofficial)
ఇతర గ్యాలరీలు