ఏప్రిల్ 1 వరకు ఈ 4 రాశుల వారికి అదృష్ట కాలమే.. కార్యసిద్ది, ధనలాభాలు ఎక్కువగా!-luck may continue with these lucky zodiac signs due to venus transit in uttara bhadrapada ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏప్రిల్ 1 వరకు ఈ 4 రాశుల వారికి అదృష్ట కాలమే.. కార్యసిద్ది, ధనలాభాలు ఎక్కువగా!

ఏప్రిల్ 1 వరకు ఈ 4 రాశుల వారికి అదృష్ట కాలమే.. కార్యసిద్ది, ధనలాభాలు ఎక్కువగా!

Published Feb 19, 2025 01:32 PM IST Chatakonda Krishna Prakash
Published Feb 19, 2025 01:32 PM IST

  • ఉత్తర భాద్రపద నక్షత్రంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి మేలు చేస్తుంది. సుమారు మరో 40 రోజులు వీరికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది.

శుక్రుడు ప్రస్తుతం ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ తెల్లవారుజాము వరకు అదే నక్షత్రంలో సంచరిస్తాడు. దీనివల్ల నాలుగు రాశుల వారికి ఇంకో 40 రోజులు కలిసొచ్చే కాలంగా ఉంటుంది. అవేవంటే.. 

(1 / 5)

మేషం: ఉత్తర భాద్రపదంలో శుక్రుడు సంచరించే కాలం మేష రాశి వారికి అదృష్టం కలుగుతుంది. చేపట్టే కార్యాల్లో అధికంగా విజయాలు సిద్ధిస్తాయి. కొందరికి ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. శుభకార్యాలు చేసేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రయాణాలు సుఖవంతంగా సాగుతాయి.

(2 / 5)

ధనస్సు:  ఉత్తర భాద్రపదలో శుక్రుడు ఉన్నంత కాలం ధనస్సు రాశి వారికి మేలే. వారి రంగాల్లో కొత్త అవకాశాలు దొరుకుతాయి. వ్యాపారులకు నూతన ఒప్పందాలు జరుగుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటాయి. 

(3 / 5)

తుల: ఈ కాలంలో తులారాశి వారికి కూడా ఎంతో  కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు డబ్బు విషయాల్లో లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. 

(4 / 5)

కుంభం: ఉత్తర భాద్రపద నక్షత్రంలో సూర్యుడు సంచరించే కాలం కుంభ రాశి వారికి అదృష్టం కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకోని వారి నుంచి కొందరికి బహుమతులు దక్కొచ్చు. ఆస్తులు కొనాలనుకునే వారికి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల అనుసారం ఈ సమాచారం అందించాం. ఇవి కేవలం అంచనాలే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు