AP TG Weather Updates : రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆపై వాయుగుండం..! ఏపీకి భారీ వర్ష సూచన-low pressure likely to form in bay of bengal on october 21 ap and telangana weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆపై వాయుగుండం..! ఏపీకి భారీ వర్ష సూచన

AP TG Weather Updates : రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆపై వాయుగుండం..! ఏపీకి భారీ వర్ష సూచన

Published Oct 20, 2024 06:50 AM IST Maheshwaram Mahendra Chary
Published Oct 20, 2024 06:50 AM IST

  • AP Telangana Weather News : బంగాళాఖాతంలో అక్టోబర్ 21వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఉరుములతో కూడన వానలు పడనున్నాయి.

నైరుతి మరియు అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాత ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. ఇదే కాకుండా మరో ఉపరితల ఆవర్తనం... మధ్య అండమాన్ సముద్ర ప్రాంతంలో విస్తరించి ఉందని పేర్కొంది. 

(1 / 8)

ఉపరితల ఆవర్తన ప్రభావంతో అక్టోబర్ 21వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ అక్టోబర్ 23వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. 

(2 / 8)

ఐఎండీ 3 రోజుల వెదర్ రిపోర్ట్ చూస్తే.. ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. సీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.  

(3 / 8)

ఏపీలో ఇవాళ(అక్టోబర్ 20) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

(4 / 8)

అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 

(5 / 8)

తెలంగాణలో చూస్తే ఇవాళ(అక్టోబర్ 20) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 

(6 / 8)

రేపు(అక్టోబర్ 21) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం అంచనా వేసింది.  

(7 / 8)

బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో... అంచనాలు మారే అవకాశం ఉంది. అక్టోబర్ 21 నుంచి 23 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంపై ఐఎండీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంటుంది.  

(8 / 8)

ఇతర గ్యాలరీలు