AP TG Weather Updates : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం…! ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు
- AP Telangana Weather Updates :తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్ తో పాటు గోదావరి ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద నీరు క్రమంగా పెరుగుతోంది. మరోవైపు మూడు నాలుగు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates :తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్ తో పాటు గోదావరి ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద నీరు క్రమంగా పెరుగుతోంది. మరోవైపు మూడు నాలుగు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(1 / 7)
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్ తో పాటు గోదావరి ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద నీరు క్రమంగా పెరుగుతోంది. మరోవైపు మూడు నాలుగు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(Image Source @APSDMA Twitter)(2 / 7)
జులై 19వ నాటికి పశ్చిమ మధ్య మరియు దానిని అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తాజా బులిటెన్ లో పేర్కొంది.
(Image Source @APSDMA Twitter)(3 / 7)
ఇవాళ, రేపు, ఎల్లుండి ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(4 / 7)
దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిచింది. సీమ ప్రాంతంలోనూ వానలు పడే ఛాన్స్ ఉంది.
(Image Source @APSDMA Twitter)(5 / 7)
తెలంగాణలో ఇవాళ్టి నుంచి రేపు ఉదయం 08,.30 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
(6 / 7)
మరోవైపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(Image Source @APSDMA Twitter)ఇతర గ్యాలరీలు