తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Rains Update: అల్పపీడనం ఎఫెక్ట్, రాయలసీమలో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వానలు
- AP TG Rains Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడటంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలోని హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతోంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP TG Rains Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడటంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలోని హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతోంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 7)
దక్షిణ కోస్తాజిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కావలి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. (PTI)
(2 / 7)
17 అక్టోబర్, గురువారం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.• కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా మరియు ఎన్టీఆర్ కొన్నిచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.(PTI)
(3 / 7)
16 అక్టోబర్, బుధవారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. (PTI)
(4 / 7)
15 అక్టోబర్, మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(5 / 7)
పెన్నా పరీవాహక లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు , కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదన్నారు. పాత భవనాలు వదిలి ముందుగానే సురక్షిత భవనాల్లోకి వెళ్ళాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
(6 / 7)
అల్పపీడన ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు 15,16,17 తేదీల్లో దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 16 బుధవారం రెండుమూడు చోట్ల భారీ నుంచి అతి తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అంచనా వేసింది.
ఇతర గ్యాలరీలు