(1 / 10)
విజయవాడలో ఫోన్ పొగొట్టుకున్న మహిళకు రికవరీ చేసిన ఫోన్ అందిస్తున్న డీపీసీ గౌతమి
(2 / 10)
ఫోన్ రికవరీ కావడంతో తీసుకోవడానికి వచ్చిన మహిళకు సాయం చేస్తున్న కానిస్టేబుల్
(3 / 10)
విజయవాడ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న/ దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా రికవరి చేసి బాధితులకు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు అందించారు.
(4 / 10)
సుమారు 60 లక్షల విలువైన 372 మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు అందించారు.
(5 / 10)
విజయవాడ పోలీసులు రికార్డు స్థాయిలో చోరీకి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఖరీదైన మొబైల్స్ చోరీకి గురవుతున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ రిజిస్టర్ సాయంతో చోరీకి గురైన ఫోన్ల ఐఎంఇఐ నంబర్లను బ్లాక్ చేసి ఎవరి వద్ద ఉన్నాయో గుర్తిస్తున్నారు. వారి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని అసలు యజమానులకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్ రికవరీ కావడంతో సీపీ రాజశేఖర బాబుకు కృతజ్ఞతలు చెబుతున్న వృద్ధుడు.
(6 / 10)
మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్ లో భాగంగా రికవరి చేసిన 372 మొబైల్ ఫోన్లను ఆదివారం ఉదయం కమాండ్ కంట్రోల్ లో పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఫిర్యాదు దారులకు అందజేశారు. నాల్గవ విడత రికవరీ ఫోన్ల విలువ సుమారుగా రూ. 60 లక్షలు ఉండవచ్చని తెలిపారు.
(7 / 10)
ప్రజల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా రికవరీ చేస్తున్నట్టు సీపీ వివరించారు. ఫిర్యాదు దారులు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పోలీసులు IMEI నెంబర్లు, బిల్లు మరియు అడ్రస్ ప్రూఫ్ లను CEIR పోర్టల్ లో నమోదు చేస్తారు.
(8 / 10)
సాంకేతికత ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేశాki, గతంలో కూడా ఇదే విధంగా భారీగా ఫోన్లను స్వాధినం చేసుకున్నారు. ఫోన్ పోయిన వెంటనే పోలీసు లకు సమాచారం ఇస్తే గుర్తించే అవకాశం ఉంటుందని సీపీ వివరించారు.
(9 / 10)
ఏ ఫోన్ ఎక్కడ ఉందో సాంకేతిక పరిజ్ఞానంతో చోరీకి గురైన ఫోన్లను గుర్తించినట్టు తెలిపారు.
ఫోన్ లోనే ప్రతి మనిషి జీవితం ఉంటుందని, బ్యాంకు లావాదేవీలు, ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఫోన్ తోనే ముడిపడి ఉన్నాయని, మరి కొన్ని ఫోన్లను గుర్తించాల్సి ఉందని త్వరలో వాటిని కూడా స్వాదీనం చేసుకోవడం జరుగుతుందన్నారు.
(10 / 10)
CEIR లో నమోదు చేసిన తర్వాత, ఫిర్యాదుదారులకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ నెంబర్ వస్తుంది. TSP (Telecom Service Provider రిజిస్టర్‌లలో IMEI నెంబర్లను బ్లాక్ చేసి, ప్రస్తుతం ఆ ఫోన్ ను ఎవరు వాడుతున్నారో వారి వివరాలను పోలీసులకు అందిస్తారు. ఇలా రికవరీ అయిన మొబైల్ ఫోన్లను తిరిగి IMEI నెంబర్‌ను అన్‌బ్లాక్ చేసి ఫిర్యాదు దారులకు పోలీసులు అందజేస్తారు.
ఇతర గ్యాలరీలు