(1 / 5)
శివుడిని ఆరాధిస్తే ఏ సమస్యలు ఉండవని చాలామంది నమ్ముతారు. శ్రావణ మాసంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధించి పూజలు చేస్తారు. విష్ణువు యోగనిద్రలోకి వెళ్లిపోయిన తర్వాత శివుడు విశ్వానికి అధిపతిగా నిలుస్తాడు.
(2 / 5)
పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండొచ్చని భక్తుల విశ్వాసం. ఈరోజు శివుడికి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం. మరి వీరిలో మీరూ ఒకరేమో చూసుకోండి.
(pinterest)(3 / 5)
మేష రాశి: మేష రాశి వారికి శివుని ప్రత్యేక ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. శివుని అనుగ్రహం ఉండటం వలన ఈ రాశి వారికి పెండింగ్‌లో ఉన్న డబ్బులు కూడా అందుతాయి. శివలింగానికి జలాభిషేకం చేసి మంత్రాలను చదవడం వలన పూర్తి కాని పనులు పూర్తయ్యిపోతాయి.
(pinterest)(4 / 5)
మకర రాశి: మకర రాశికి అధిపతి శని. శని శివుని భక్తుడు. మకర రాశి వారిపై శివుని దయ ఎప్పుడూ ఉంటుంది. సానుకూల శక్తి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఎక్కువ అవకాశాలను పొందుతారు. శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయడం వలన ఈ రాశి వారికి కలిసి వస్తుంది.
(pinterest)(5 / 5)
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి కూడా శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశికి అధిపతి చంద్రుడు. దీంతో శివుడు ఎప్పుడూ కూడా ఈ రాశి వారిపై దయతో ఉంటాడు. ఈ రాశి వారికి శివుని అనుగ్రహం వలన ఆదాయం పెరుగుతూ ఉంటుంది. సోమవారం నాడు శివునికి బిల్వపత్రాలను సమర్పిస్తే మంచిది.
(pinterest)ఇతర గ్యాలరీలు