(1 / 8)
బాలీవుడ్ బాద్ షాగా ప్రసిద్ధి చెందిన నటుడు షారుఖ్ ఖాన్ చిత్ర పరిశ్రమలో అత్యధికంగా సంపాదిస్తున్న నటులలో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ ఐకాన్ అయిన ఈయనకు హాలీవుడ్‌లోని బెవర్లీ హిల్స్‌లో రాత్రికి ₹ 2 లక్షలరూపాయల అద్దె వసూలు చేసి విలాసవంతమైన వెకేషన్ మాన్షన్ ఉందని మీకు తెలుసా?
(2 / 8)
లాస్ ఏంజిల్స్ లోని షారూక్ ఖాన్ "లా మాన్షన్" అత్యంత విలాసవంతంగా, అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్, ఆశ్చర్యపరిచేలా ఉండే వంటగది, పచ్చిక బయళ్ళు, తోటలు, గేమింగ్ జోన్ వంటి ఎన్నో విశేషాలు అక్కడ ఉంటాయి. ఇక్కడ ఉండాలంటే రోజుకు ₹2 లక్షలు అద్దె చెల్లించాలి.
(3 / 8)
ప్యాలెస్ లాంటి ఈ లగ్జరీ హౌస్ లో చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. అక్కడ దిగిన ఈ ఫోటోను షారుఖ్ ఖాన్ స్వయంగా షేర్ చేశారు. ఈ ఫోటోలో ఆయన స్విమ్మింగ్ పూల్ ఒడ్డున కూర్చొని ఫోటోకు ఫోజులిచ్చారు.
(4 / 8)
ఇది కింగ్ ఖాన్ ఇంటిలోని అందమైన బాత్రూం. ఇది రాజ స్నానాలను గుర్తుకు తెస్తుంది. ఈ బాత్రూం హాలు చాలా పెద్దది. అలాగే అందంగా అలంకరించి ఉంటుంది. వివిధ రకాల సెంటెంట్ కొవ్వొత్తులు ఎన్నో ఇక్కడ కనిపిస్తాయి.
(5 / 8)
విలాసవంతమైన సోఫాలు, గోడల మీద ఖరీదైన పెయింటింగ్ లతో అద్భుతంగా కపినిపిస్తున్న హాల్ ఇది. ఇక్కడ బస చేసేవారు ఈ అందమైన ప్రదేశంలో సేదతీరవచ్చు.
(6 / 8)
ప్యాలెస్ లాంటి ఈ లగ్జరీ హౌస్ లో చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. చూట్టూ పచ్చదనంతో నిండిన లాన్ ఏరియా చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది. ఈయన లాస్ ఏంజిల్స్ కి వచ్చినప్పుడల్లా ఇక్కడ ఎక్కువ సేపు సేద తీరుతారు.
(7 / 8)
అత్యంత విలువైన, విలాసవంతమైన ఈ మాన్షన్ బయటి నుండి ఇలా కనిపిస్తుంది. అందమైన బాల్కనీ, ముందు స్విమ్మింగ్ పూల్, గార్డెన్, స్పామింగ్ ఫూల్ ముందు విస్తరించిన సులభమైన మంచాలు ఇవన్నీ లగ్జరియస్ లైఫ్ అంటే ఏంటో చూపిస్తాయి.
(8 / 8)
ఈ మాన్షన్ ఆరు విశాలమైన బెడ్‌రూమ్‌లను కలిగి ఉంది. వాటిలో విశాలమైన జాకుజీలు, భారీ కొలనును చూసే ప్రైవేట్ క్యాబిన్ లు, ఒక ప్రైవేట్ టెన్నిస్ కోర్టు, డ్రాయింగ్ రూం వంటివెన్నో ఉన్నాయి. ఈ విలాసవంతమైన ప్రదేశం శాంటా మోనికా, రోడియో డ్రైవ్, వెస్ట్ హాలీవుడ్ నుండి ఐదు నిమిషాల నడక దూరంలో ఉంది.షారుఖ్ ఖాన్ గత కొన్నేళ్లుగా ఈ ఇంటిని అద్దెకు ఇస్తూ రోజుకు రెండు లక్షల రూపాయల వరకూ సంపాదిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు