Lockie Ferguson: 4 ఓవర్లు.. 0 పరుగులు.. 3 వికెట్లు.. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ బౌలర్ ఫెర్గూసన్
- Lockie Ferguson - T20 World Cup 2024: న్యూజిలాండ్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ అద్భుతం చేశాడు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‍లో నేడు (జూన్ 17) నాలుగు ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీసి అద్భుత రికార్డు సృష్టించాడు.
- Lockie Ferguson - T20 World Cup 2024: న్యూజిలాండ్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ అద్భుతం చేశాడు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‍లో నేడు (జూన్ 17) నాలుగు ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీసి అద్భుత రికార్డు సృష్టించాడు.
(1 / 5)
న్యూజిలాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో పపువా న్యూగినియాతో ట్రినిడాడ్‍లో నేడు (జూన్ 17) జరిగిన గ్రూప్-సీ మ్యాచ్‍లో అద్భుతమైన స్పెల్ వేశాడు. ఏకంగా నాలుగు మెయిడిన్ ఓవర్లు వేశాడు ఫెర్గూసన్.
(AP)(2 / 5)
ఈ మ్యాచ్‍లో నాలుగు ఓవర్లు వేసిన లాకీ ఫెర్గూసన్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. మూడు వికెట్లు పడగొట్టాడు (4-4-0-3). 5వ ఓవర్, 7వ ఓవర్, 12వ ఓవర్, 14వ ఓవర్ వేసిన వేసిన ఫెర్గూసన్ ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. ఫెర్గూసన్ పేస్‍కు న్యూగినియా బ్యాటర్లు వణికిపోయారు.
(ICC)(3 / 5)
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్‍లో నాలుగు మెయిడిన్లు వేసి పరుగులేమీ ఇవ్వని తొలి బౌలర్‌గా కివీస్ పేసర్ లాకీ ఫెర్గూసన్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‍గా అంతర్జాతీయ టీ20ల్లో ఈ రికార్డు సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు.
(4 / 5)
2021లో కెనడా బౌలర్ సాద్ బన్ జాఫర్.. పనామాపై 4 ఓవర్లలో నాలుగు మెడిన్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 2 వికెట్లు తీశాడు. ఇప్పుడు, టీ20 ప్రపంచకప్‍లో ఒకే మ్యాచ్‍లో నాలుగు మెయిడిన్ల ఫీట్‍ను ఫెర్గూసన్ సాధించాడు. ఈ ఘనత దక్కించుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. భవిష్యత్తులో ఎవరైనా ఈ రికార్డును సమం చేయగలరే తప్ప బద్దలుకొట్టే అవకాశమే ఉండదు.
(AP)(5 / 5)
న్యూజిలాండ్ పేసర్ ఫెర్గూసన్ అద్భుతం చేయడం సహా మిగిలిన బౌలర్లు కూడా రాణించటంతో 78 పరుగులకే పపువా న్యూగినియా ఆలౌటైంది. ఈ గ్రూప్ దశ చివరి మ్యాచ్ గెలిచినా టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8కు న్యూజిలాండ్ వెళ్లలేదు. రెండు ఓటములతో ఇప్పటికే గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి కివీస్ నిష్క్రమించడం ఖాయమైంది. గ్రూప్-సీ నుంచి సూపర్-8కు అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ చేరాయి.
(Photo: ICC)ఇతర గ్యాలరీలు