IPL 2025 New Captains: కొత్త సీజన్.. ఐపీఎల్ కొత్త కెప్టెన్ల లిస్ట్ ఇదే.. నాయకులను మార్చిన 5 టీమ్స్.. ఓ లుక్కేయండి.
- IPL 2025 New Captains: ఐపీఎల్ 2025 సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. మార్చి 22న కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్ లో టైటిల్ కోసం అన్ని జట్లూ ఆయుధాలు సిద్దం చేసుకుంటున్నాయి. అయిదు ఫ్రాంఛైజీలు కొత్త కెప్టెన్లను ఆనౌన్స్ చేశాయి. ఆ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

(1 / 5)
ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి తిరిగి కోహ్లి కెప్టెన్సీ వహిస్తాడనే ప్రచారం జోరుగా సాగింది. కానీ యువ ఆటగాడు రజత్ పటీదార్ కే పగ్గాలు దక్కాయి. ఓ మేజర్ టీమ్ కు కెప్టెన్ గా ఎంపికవడం రజత్ కు ఇదే తొలిసారి.
(x/RCBTweets)(2 / 5)
ఐపీఎల్ 2025 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ ను నడిపించిన అననుభవం అతనికి ఉంది. వేలంలో పంత్ ను ఎల్ఎస్జీ రూ.27 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది.
(x/nsideSportIND)(3 / 5)
సీనియర్ ప్లేయర్ అజింక్య రహానె డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ కు కొత్త సారథి. ఐపీఎల్ 2025 లో అతను కేకేఆర్ ను నడిపించబోతున్నాడు. కుర్రాళ్లను కాదని రహానె అనుభవానికి కేకేఆర్ ఓటేసింది.
(x/KKRiders)(4 / 5)
ఐపీఎల్ టైటిల్ బోణీ కొట్టని పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై కోటి ఆశలు పెట్టుకుంది. గత సీజన్ లో కేకేఆర్ ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ ను వేలంలో రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది.
(x/PunjabKingsIPL)ఇతర గ్యాలరీలు