Liquor Shops : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - ఈ 2 రోజులు వైన్స్ షాపులు బంద్..!
- Liquor Shops Closed in Hyderabad: హైదరాబాద్ బోనాలకు సర్వం సిద్ధమవుతోంది. జూలై 28, 29 తేదీల్లో బోనాల వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈ రెండు రోజులు వైన్స్ షాపులు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- Liquor Shops Closed in Hyderabad: హైదరాబాద్ బోనాలకు సర్వం సిద్ధమవుతోంది. జూలై 28, 29 తేదీల్లో బోనాల వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈ రెండు రోజులు వైన్స్ షాపులు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
(1 / 6)
హైదరాబాద్ బోనాలకు సర్వం సిద్ధమవుతోంది. జూలై 28, 29 తేదీల్లో బోనాల వేడుకలు జరగనున్నాయి.
(Image Source From unsplash.com)(2 / 6)
శ్రీ మహంకాళి లాల్ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా అంబారీ పై అమ్మవారి ఊరేగింపు వేడుకలు జరగనున్నాయి. ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. ఆయా రూట్లలో వాహనాలను కూడా మళ్లించనున్నారు. ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
(Image Source From unsplash.com)(3 / 6)
లాల్ దర్వాజ బోనాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నగర పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అన్ని రకాల వైన్స్ షాపులు మూసివేయాలని ఆదేశాలను జారీ చేశారు. జూలై 28వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
(Image Source From unsplash.com)(4 / 6)
ముఖ్యంగా సౌత్ జోన్‌లోని చార్మినార్, కమాటిపుర, హుస్సేనీ ఆలం, ఫలక్‌నుమా, మొఘల్‌పురా, చైటినాక, షాలిబండ , మీర్‌చౌక్, డబ్బిర్ పుర ప్రాంతాల్లో 28వ తేదీన ఉదయం 6 గంటలనుంచి రెండు రోజుల పాటు దుకాణాలు బంద్ అవుతాయి. కల్లు దుకాణాలు కూడా తెరుచుకోవు. 30వ తేదీన ఉదయం 6 గంటల వరకు ప్రభుత్వ ఆదేశాలు అమల్లో ఉంటాయి.
(5 / 6)
మరోవైపు సౌత్ ఈస్ట్ జోన్‌లోని చాంద్రాయణగుట్ట , బండ్లగూడ వంటి ప్రాంతాల్లో జులై 28 ఉదయం 6 గంటల నుంచి 24 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయబడతాయి.
(Image Source From unsplash.com)(6 / 6)
ఆషాద మాసంలో హైదరాబాద్ పరిధిలో బోనాలు జరుగుతున్నాయి. ఎక్కడైతే బోనాలు జరుగుతున్నాయో… ఆయా పరిధిలో ముందస్తుగానే వైన్స్ షాపులను మూసివేయిస్తున్నారు. డ్రై డేలో లిక్కర్ కోనుగోలు చేస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ రెండు రోజులు కూడా ఇదే తరహా నిబంధనలను అమలు చేయనున్నారు.
(Image Source From unsplash.com)ఇతర గ్యాలరీలు