(1 / 6)
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పలుచోట్ల వడగాల్పులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(istockphoto.com)(2 / 6)
ఓవైపు ఎండల తీవ్రత ఉండగా… మరోవైపు తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఏప్రిల్ 26వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(istockphoto.com)(3 / 6)
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ వివరాల ప్రకారం…. ఏప్రిల్ 29వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
(istockphoto.com)(4 / 6)
ఏప్రిల్ 24, 25 తేదీల్లో మాత్రమే పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏప్రిల్ 24వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.
(istockphoto.com)(5 / 6)
ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో రాత్రిపూట వేడి వాతావరణ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(istockphoto.com)(6 / 6)
మరోవైపు ఏపీలోని ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. దక్షిణ కోస్తాలోనూ ఇదే పరిస్థితి ఉండనుంది. రాయలసీమలో కొన్నిచోట్ల పొడి వాతావరణం ఉండనుంది. మరికొన్నిచోట్ల తేలికపాటి జల్లలు పడొచ్చు.
ఇతర గ్యాలరీలు