(1 / 8)
కొద్దిరోజులుగా తెలంగాణ, ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 దాటితే చాలు బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు.
(2 / 8)
ఈ ఏడాది ఫిబ్రవరి మాసం నుంచి ఎండల తీవ్రత మొదలైన సంగతి తెలిసిందే. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మే మాసం రాకముందే... మార్చి నెలలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్న పరిస్థితులు ఉన్నాయి. చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
(image source unsplash.com)(3 / 8)
తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానురాను పరిస్థితి మారే అవకాశం ఉంది. మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఎండల తీవ్రతతో చాలా ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేస్తున్నారు.
(image source unsplash.com)(4 / 8)
ఓవైపు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. మార్చి 21వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
(Photo Source @APSDMA Twitter)(5 / 8)
మార్చి 22వ తేదీన పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబపాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(6 / 8)
మార్చి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు జల్లులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది. మార్చి 22వ తేదీన హెచ్చరికలు అమల్లో ఉంటాయని.. మిగతా తేదీల్లో ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
(image source pixabay )(7 / 8)
ఓవైపు ఎండలు…. మరోవైపు వర్ష సూచన ఉండటంతో తెలంగాణలో భిన్న వాతావరణం కనిపించే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు కురిస్తే కాస్త ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
(Photo Source @APSDMA Twitter)ఇతర గ్యాలరీలు