(1 / 7)
అకాల వర్షాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత వారంలో కాస్త ఎండ తీవ్రత తగ్గినప్పటికీ… మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. చాలాచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి.
(2 / 7)
ఏపీలో రోజురోజుకూ సూర్యుడి ప్రతాపం పెరుగుతుండగా… కొన్నిచోట్ల వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు అమరావతి వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ ఇచ్చింది.
(Photo Source @APSDMA Twitter)(3 / 7)
అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి... సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా... ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర కేరేళ వరకు, అంతర్గత కర్ణాటక మీదుగా విస్తరించి ఉన్న మరో ద్రోణి ఇవాళ బలహీనపడిందని వివరించింది.
(4 / 7)
ద్రోణి ప్రభావంతో… ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఎల్లుండి(మార్చి 30) తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉంది.
(5 / 7)
అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం... ఇవాళ, రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
(6 / 7)
ఇక రాయలసీమలో చూస్తే ఇవాళ, రేపు, ఎల్లుండి... పొడి వాతావరణం ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు