తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : ఉపరితల ఆవర్తన ప్రభావం..! ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు
- AP Telangana Weather Updates : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తాజా వెదర్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ చూడండి….
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 7)
నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది.
(2 / 7)
ఆవర్తన ప్రభావంతో ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు సీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 7)
ఏపీలో ఇవాళ(నవంబర్ 15) కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(4 / 7)
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.(Unsplash)
(5 / 7)
ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. (Unsplash)
(6 / 7)
నవంబర్ 17వ తేదీ నుంచి తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇతర గ్యాలరీలు