(1 / 7)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కి.మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది. ఏపీ, యానంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
(2 / 7)
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ(12 జనవరి 2025) దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
(3 / 7)
దక్షిణ కోస్తాలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉండనుంది
(4 / 7)
రాయలసీమ జిల్లాలోల ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని అంచనా వేసింది.
(5 / 7)
ఇక తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో ఐదారు రోజులు ఇలాగే ఉంటుందని తాజా బులెటిన్ లో పేర్కొంది.
(6 / 7)
తెలంగాణ ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. జనవరి 17వ తేదీ వరకు కూడా పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది.
(7 / 7)
ఇక రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వివరించింది.
ఇతర గ్యాలరీలు