(1 / 6)
ఆంధ్రప్రదేశ్ కు అమరావతి వాతావరణ కేంద్రం వర్ష సూచన ఇచ్చింది. పలుచోట్ల ఇవాళ తేలికపాటి లేదా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు తాజా వెదర్ బులెటిన్ ను విడుదల చేసింది.
(2 / 6)
ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
(3 / 6)
దక్షిణ కోస్తాలో చూస్తే ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది.
(4 / 6)
రాయలసీమలో చూస్తే ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
(5 / 6)
రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది. ఈ మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
(6 / 6)
హైదరాబాద్ నగరంలో చూస్తే ఆకాశం పాక్షికంగా మేఘావృత్తమై ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు తూర్పు, ఆగ్నేయ దిశలో గంటకు 04- 08 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
ఇతర గ్యాలరీలు