తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీలో మోస్తరు వర్షాలు, 5వ తేదీ నుంచి తెలంగాణలో పొడి వాతావరణం..!
- AP Telangana Weather News : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని ఐఎండీ తెలిపింది. దక్షిణ తమిళనాడును అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఇక తెలంగాణలో 5 నుంచి పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు, దానిని అనుకొని ఉన్న శ్రీలంక తీరాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి.
(2 / 6)
ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది.
(3 / 6)
ఏపీలో ఇవాళ(నవంబర్ 3, 2024) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు మరియు పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(4 / 6)
అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(5 / 6)
తెలంగాణలో చూస్తే ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
ఇతర గ్యాలరీలు