AP TG Weather Updates : విస్తరిస్తున్న 'నైరుతి', కొనసాగుతున్నఉపరితల ఆవర్తనం - ఇవాళ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు..!
- Rains in Telugu States : రుతుపవనాల రాకతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Rains in Telugu States : రుతుపవనాల రాకతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
(1 / 7)
రానున్న 3 -4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, కోస్తాంధ్రా ప్రాంతంలోని మిగిలిన భాగాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది.
(image source unshplash.com)(2 / 7)
ఉత్తర రాయలసీమతో పాటు పరిసర ప్రాంతాలపై గల సముద్రమట్టానికి 1.5 కిమీ ఎత్తులో ఉన్న ఉపరిత ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణతో పాటు పొరుగు ప్రాంతాలపై కొనసాగుతున్నట్లు పేర్కొంది.
(image source usnhplash.com)(3 / 7)
రుతుపవనాల విస్తరణతో పాటు ఉపరిత ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో నాలుగైదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలుచోట్ల పిడుగులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.
(4 / 7)
ఇవాళ(జూన్ 8) తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నారారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(5 / 7)
తెలంగాణలో జూన్ 13వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఏపీలో చూస్తే…. ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జూన్ 11వ తేదీ వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
(6 / 7)
(7 / 7)
ఇక పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
(Photos Source @APSDMA Twitter)ఇతర గ్యాలరీలు