(1 / 7)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం అయితే చాలు బయటికి రావాలంటే జనాలు భయపడిపోతున్నారు.
(Photo Source @APSDMA Twitter)(2 / 7)
ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుండగా… రాయలసీమకు మాత్రం ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(image source unsplash.com)(3 / 7)
నైరుతు బంగాళాతం మురియ తమిళనాడు తీర ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
(4 / 7)
అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం…ఇవాళ, రేపు ఉత్తర, దక్షిణ కోస్తాలో పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది. 2 నుంచి 4 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
(image source pixabay )(5 / 7)
రాయలసీమ ఇవాళ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి మాత్రం పొడి వాతావరణమే ఉండనుందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
(Photo Source From unsplash.com)(6 / 7)
ఇక తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు కూడా లేవు
ఇతర గ్యాలరీలు