AP TG Weather Updates : ఎండలు మండుతున్న వేళ ఐఎండీ చల్లని కబురు - ఆ తేదీ నుంచి తెలంగాణలో వర్షాలు..!
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం దాటితే చాలు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో ఫిబ్రవరి 21 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా అప్డేట్స్ ఇవే…
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం దాటితే చాలు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో ఫిబ్రవరి 21 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా అప్డేట్స్ ఇవే…
(1 / 8)
ఏపీ, తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మాసం దాటకముందే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. సగటు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగానే నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి.
(2 / 8)
ఉదయం 11 దాటితే చాలు ప్రజలు ఇబ్బందిపడిపోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నాం సమయంలో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది. అప్పుడే వేసవి వచ్చేసిందా..? అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది.
(image source unsplash.com)(3 / 8)
చాలాచోట్ల ఇప్పటికే 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటిన పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణతో పోల్చితే.. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది.
(image source unsplash.com)(4 / 8)
ఫిబ్రవరి మాసంలోనే ఎండలతో సతమవుతున్న తెలంగాణ వాసలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఈనెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది.
(image source unsplash.com)(5 / 8)
ఫిబ్రవరి 21వ తేదీ నుంచి తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
(image source unsplash.com)(6 / 8)
ఫిబ్రవరి 23వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు మాత్రం పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేసింది.
(image source unsplash.com)(7 / 8)
తెలంగాణలో ఇవాళ్టి వెదర్ చూస్తే… పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఏపీలో చూస్తే గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
(image source unsplash.com)ఇతర గ్యాలరీలు