తెలుగు న్యూస్ / ఫోటో /
TG Weather Updates : అల్పపీడనం ఎఫెక్ట్...! తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు, వెదర్ రిపోర్ట్ వివరాలివే
- Telangana Weather Updates : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో ఇవాళ్టి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీకి హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి....
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana Weather Updates : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో ఇవాళ్టి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీకి హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి....
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 7)
పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది.ఈ ప్రభావంతో ఇవాళ్టి నుంచి తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
(2 / 7)
నిన్నటి వరకు తెలంగాణలో పొడి వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. అయితే అల్పపీడన ప్రభావంతో ఇవాళ్టి (నవంబర్ 13) నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడకక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
(3 / 7)
నవంబర్ 16వ తేదీ వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని తాజా బులెటిన్ లో తెలిపింది.
(4 / 7)
నవంబర్ 17వ తేదీ నుంచి మళ్లీ తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
(5 / 7)
ఇక హైదరాబాద్ లో చూస్తే... ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. ఉపరితల గాలులు ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉంది.
(6 / 7)
ఏపీలో ఇవాళ(నవంబర్ 13) బాపట్ల,ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • అల్లూరి,కాకినాడ,తూర్పుగోదావరి, కోనసీమ,విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,తూర్పుగోదావరి,కోనసీమ, పశ్చిమగోదావరి,కృష్ణా, గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(7 / 7)
వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని హెచ్చరించింది. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలని కోరింది.
ఇతర గ్యాలరీలు