(1 / 7)
ఏపీ, తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉంది. మరోవైపు చాలాచోట్ల చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది. తాజా వెదర్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ చూడండి….
(2 / 7)
ఏపీలోని ఉత్తర కోస్తాలో ఇవాళ పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణం కేంద్రం తెలిపింది. ఎలాంటి వర్ష సూచన లేదని వెల్లడించింది.
(3 / 7)
దక్షిణ కోస్తాలో ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల పొడి వాతావరణం ఉండనుంది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవు.
(4 / 7)
రాయలసీమలో చూస్తే ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
(5 / 7)
ఇక తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టం చేసింది. ఈ వారమంతా ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది.
(6 / 7)
తెలంగాణలోని పలుచోట్ల రాబోయే 4 రోజులు అక్కడకక్కడ ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
(7 / 7)
తెలంగాణలో చలి తీవ్రత ఉన్నప్పటికీ… ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇతర గ్యాలరీలు