తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు - రేపట్నుంచి తెలంగాణలో పొడి వాతావరణం..!
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఎండీ వివరాలను పేర్కొంది. కోస్తా, సీమ జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక తెలంగాణలో తేలికపాటి జల్లులు పడొచ్చు.

(1 / 7)
ఏపీ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశలో గాలు వీస్తున్నాయని ఐఎండీ తాజా బులెటిన్ లో పేర్కొంది. ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(2 / 7)
ఏపీలో ఇవాళ(నవంబర్ 16, 2024) ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 7)
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు సీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కూడా పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
(4 / 7)
ఏపీలో రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.
(5 / 7)
తెలంగాణలో ఇవాళ(నవంబర్ 16, 2024) తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
(6 / 7)
మరోవైపు తెలంగాణలో నవంబర్ 17వ తేదీ నుంచి పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.(Unsplash)
ఇతర గ్యాలరీలు