తెలుగు న్యూస్ / ఫోటో /
TS AP Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! ఏపీ, తెలంగాణకు IMD చల్లని కబురు - ఈ ప్రాంతాలకు వర్ష సూచన!
- AP Telangana Weather Updates: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు చెప్పింది వాతావరణశాఖ(IMD). ఉత్తర కోస్తాకు ఇవాళ, రేపు వర్ష సూచన ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఇచ్చింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
ఏపీ, తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి మాసంలోనే భానుడి ప్రతాపం పెరిగిపోయింది. ఏప్రిల్, మే నెలలో మరింత ఎండలు ఉంటాయని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలను జారీ చేసింది.(unsplash.com)
(2 / 6)
గత కొద్దిరోజులుగా ఎండలతో తీవ్ర ఇబ్బందిపడుతున్నారు ప్రజలు. అయితే ఉపశమనం కలిగించేలా ఐఎండీ చల్లని కబురు చెప్పింది.(unsplash.com)
(3 / 6)
గత వారం రోజులుగా ఏపీలోని ఉత్తర కోస్తాలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.(unsplash.com)
(4 / 6)
మరోసారి ఉత్తర కోస్తాకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ కేంద్రం. గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర కోస్తా వరకు ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోమి కొనసాగుతుందని ఐఎండీ తాజా బులెటిన్ లో పేర్కొంది. (unsplash.com)
(5 / 6)
ఇవాళ, ఎల్లుండి ఉత్తర కోస్తా ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ కోస్తా, సీమ జిల్లాలో మాత్రం ఎండల తీవ్రత ఉంటుందని పేర్కొంది.(unsplash.com)
ఇతర గ్యాలరీలు