తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : ఏపీలో తేలికపాటి వర్షాలు - తెలంగాణకు 'పొగమంచు' హెచ్చరిక!
- AP Telangana Weather : ఏపీ, తెలంగాణకు IMD అలర్ట్ ఇచ్చింది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో రేపు ఉదయం సమయంలో పొగమంచు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిల్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(2 / 6)
రేపు (డిసెంబర్ 06, 2024) అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
(3 / 6)
డిసెంబర్ 7వ తేదీ నుంచి ఏపీలో వాతారణం పొడిగా మారే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి వర్ష సూచన లేదని తాజా బులెటిన్ లో ప్రస్తావించింది.
(4 / 6)
ఇక తెలంగాణలో చూస్తే నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
(5 / 6)
ఇక రేపు(డిసెంబర్ 06, 2024) ఉదయం 08. .30 గంటల లోపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. వచ్చే వారంలో రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని పేర్కొంది.
ఇతర గ్యాలరీలు