(1 / 7)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం దాటితే చాలు... బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు.
(2 / 7)
ఈ ఏడాది ఫిబ్రవరి మాసం నుంచి ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రత ఉంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మే మాసం రాకముందే... మార్చి నెలలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్న పరిస్థితులు ఉన్నాయి.
(3 / 7)
తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానురాను పరిస్థితి మారే అవకాశం ఉంది. మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఎండల తీవ్రతతో చాలా ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేస్తున్నారు.
(4 / 7)
దక్షిణ తెలంగాణతో పోల్చితే ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఎండల ప్రభావం ఎకువగా ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాద్, సిరిసిల్ల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా రికార్డవుతున్నాయి.
(5 / 7)
మార్చి 20 వరకు మాత్రం తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది. పలు జిల్లాల్లో వేడిగాలుల వీచే అవకాశం ఉంది.
(image source unsplash.com)(6 / 7)
మార్చి 24వ తేదీ వరకు వర్ష సూచన ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పంట నష్టం రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు