(1 / 8)
దక్షిణ ఛత్తీస్ ఘట్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర - దక్షిణ ద్రోమి ఇవాళ ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర కేరళ వరకు విస్తరించింది ఉంది. అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
(2 / 8)
ఈ ప్రభావంతో ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. రేపు, ఎల్లుండి మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని స్పష్టం చేసింది.
(image source unsplash.com)(3 / 8)
ఇక దక్షిణ కోస్తాలో చూస్తే...పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలసెంటిగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కూడా ఇదే మాదిరి ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది. వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది.
(4 / 8)
ఇక సీమలో చూస్తే ఇవాళ తేలికపాటి వర్షాలు ఉండగా... రేపు, ఎల్లుండి మాత్రం పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు ధోరణి 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని అమరావతావరణ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో వివరించింది.
(5 / 8)
ఏపీలో రేపు అనగా శుక్రవారం (28-03-25) శ్రీకాకుళం జిల్లా -14, విజయనగరం-22, పార్వతీపురంమన్యం -12, అల్లూరి సీతరామరాజు-9, అనకాపల్లి-9, కాకినాడ-7, తూర్పుగోదావరి-8, ఏలూరు-5, ఎన్టీఆర్ -3 మండలాల్లో తీవ్రవడగాలులు (89) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు APSDMA డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
(6 / 8)
ఇవాళ ప్రకాశం జిల్లాలోని నందనమారెళ్ళలో 42.4°C, నెల్లూరు జిల్లాలోని కొమ్మిపాడులో 42.2°C, వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్టలో 42.1°C,కర్నూలులో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఇవాళ 105 ప్రాంతాల్లో 40°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(Photo Source @APSDMA Twitter)(7 / 8)
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ కోనసీమ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఎక్కువగా వడగాల్పుల ప్రభావం ఉంటుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాగు నీటి సరఫరా, ఉపాధి పనుల సమయంలో మార్పులు, హెల్త్ కిట్స్, అవగాహన కార్యక్రమాలకు సంబంధించి కీలక సూచనలు చేసింది.
(AFP)ఇతర గ్యాలరీలు