Omicron | డెల్టాను ఎదుర్కొనే శక్తి ఒమిక్రాన్ ఇస్తుందా.. సైంటిస్ట్ మాట ఇదీ!
కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇండియాలోనే కాదు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఈ వేరియెంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ స్పందించారు. వైరస్ ను ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ పెంచుకోవడమే మార్గమని చెప్పారు.

(1 / 6)
ఈ మధ్యే ఒమిక్రాన్ వేరియెంట్‌పై డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ స్పందించారు. డెల్టాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని ఒమిక్రాన్ ఇచ్చే అవకాశం ఉన్నదని ఆమె అన్నారు. అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి.
(Reuters)(2 / 6)
ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకొని ఒమిక్రాన్ బారిన పడిన వారు.. డెల్టాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి సాధిస్తున్నారని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. అయితే ఇది వ్యాక్సిన్ వేసుకోని వారికి మాత్రం వర్తించదు.
(Reuters)(3 / 6)
ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ సాయపడుతోందని ఓ అధ్యయనం తేల్చిన విషయాన్ని ఈ సందర్భంగా సౌమ్య గుర్తు చేశారు. అయితే వ్యాక్సిన్‌కు ప్రత్యామ్నాయం కొవిడ్ బారిన పడటం ఒక్కటే కాదని ఆమె స్పష్టం చేశారు.
(File Photo)(4 / 6)
వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు, వేసుకోని వాళ్లు కూడా ఒమిక్రాన్ బారిన పడినట్లు ఈ అధ్యయనం తేల్చింది. అయితే, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు ఈ వేరియెంట్‌ను సమర్థంగా ఎదుర్కొన్నట్లు కూడా స్పష్టమైంది.
(Reuters)(5 / 6)
వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు ఒమిక్రాన్, డెల్టాలను సమర్థంగా ఎదుర్కొన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. అందువల్ల డెల్టాను ఎదుర్కోవడానికి ఒమిక్రాన్ బారిన పడటం ఒక్కటే ప్రత్యామ్నాయం కాదు. వ్యాక్సిన్ వేసుకుంటేనే ఈ రెండు వేరియెంట్లతో సమర్థంగా ఫైట్ చేయగలం.
(PTI)ఇతర గ్యాలరీలు