Dry Skin | చర్మం పొడిబారుతుంటే ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి!-give life to your dry skin with these ayurvadic tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Give Life To Your Dry Skin With These Ayurvadic Tips

Dry Skin | చర్మం పొడిబారుతుంటే ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి!

Feb 07, 2022, 03:39 PM IST HT Telugu Desk
Feb 07, 2022, 03:39 PM , IST

  • శీతాకాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లు రావడం సహజంగా జరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే చర్మానికి సరైన పోషణ అందివాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఇక్కడ అందిస్తున్నాం.

శీతాకాలంలో ఉండే చల్లని వాతావరణం మీ చర్మంలోని తేమను లాగేస్తుంది. దీంతో మీ చర్మం పొడిబారి పగుళ్లు రావడం జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దీక్షా భావ్‌సర్‌ పలు చిట్కాలను అందించారు. వీటిని పాటించడం చేత చర్మంలోని తేమ తిరిగివచ్చి చర్మం మృదువుగా తయారవుతుంది.

(1 / 7)

శీతాకాలంలో ఉండే చల్లని వాతావరణం మీ చర్మంలోని తేమను లాగేస్తుంది. దీంతో మీ చర్మం పొడిబారి పగుళ్లు రావడం జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దీక్షా భావ్‌సర్‌ పలు చిట్కాలను అందించారు. వీటిని పాటించడం చేత చర్మంలోని తేమ తిరిగివచ్చి చర్మం మృదువుగా తయారవుతుంది.(Pixabay)

Abhyanga: సాధారణంగా మనం పండగలప్పుడు శరీరాన్ని నూనెతో మర్ధన చేసుకొని అభ్యంగన స్నానం చేయడం తెలిసిందే. అయితే శీతాకాలంలో ఇలా నూనెతో మర్ధన (ఆయిల్ మసాజ్) చేయడం ద్వారా చర్మానికి మంచి పోషణ లభిస్తుంది. అంతేకాకుండా అలసట, నిద్రలేమి, ఒళ్లు నొప్పులు దూరం అవుతాయి. చర్మంలో వృద్ధాప్య ఛాయలు కనిపించవు.

(2 / 7)

Abhyanga: సాధారణంగా మనం పండగలప్పుడు శరీరాన్ని నూనెతో మర్ధన చేసుకొని అభ్యంగన స్నానం చేయడం తెలిసిందే. అయితే శీతాకాలంలో ఇలా నూనెతో మర్ధన (ఆయిల్ మసాజ్) చేయడం ద్వారా చర్మానికి మంచి పోషణ లభిస్తుంది. అంతేకాకుండా అలసట, నిద్రలేమి, ఒళ్లు నొప్పులు దూరం అవుతాయి. చర్మంలో వృద్ధాప్య ఛాయలు కనిపించవు.(Pixabay)

Atapa-Sevana: అభ్యంగనం తర్వాత ఆటప సేవనం చేసుకోవాలి. అంటే శరీరానికి ఆయిల్ మసాజ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఎండలో నిలబడితే అది చర్మానికి పట్టించిన నూనె చర్మం సరిగ్గా గ్రహించగలుగుతుంది, విటమిన్ డి సంశ్లేషణ కూడా జరుగుతుంది. అలాగే చల్లటి వాతావరణంలో శరీరానికి కొంత వెచ్చదనం కల్పించినట్లు అవుతుంది.

(3 / 7)

Atapa-Sevana: అభ్యంగనం తర్వాత ఆటప సేవనం చేసుకోవాలి. అంటే శరీరానికి ఆయిల్ మసాజ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఎండలో నిలబడితే అది చర్మానికి పట్టించిన నూనె చర్మం సరిగ్గా గ్రహించగలుగుతుంది, విటమిన్ డి సంశ్లేషణ కూడా జరుగుతుంది. అలాగే చల్లటి వాతావరణంలో శరీరానికి కొంత వెచ్చదనం కల్పించినట్లు అవుతుంది.(Pixabay)

Vyayama:వ్యాయామాలు చేయటానికి శీతాకాలం చాలా అత్యుత్తమమైన సీజన్. ఈ కాలంలో శరీరంలో నిక్షిప్తమై ఉండే శక్తి ఎక్కువగా వినియోగం జరగదు. కాబట్టి ఆరుబయట ఎవరి శక్తి మేరకు వారు తగినంత వ్యాయామం చేస్తే శరీరం వెచ్చగా, మరింత దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా తినే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సామర్థ్యం పెరుగుతుంది.

(4 / 7)

Vyayama:వ్యాయామాలు చేయటానికి శీతాకాలం చాలా అత్యుత్తమమైన సీజన్. ఈ కాలంలో శరీరంలో నిక్షిప్తమై ఉండే శక్తి ఎక్కువగా వినియోగం జరగదు. కాబట్టి ఆరుబయట ఎవరి శక్తి మేరకు వారు తగినంత వ్యాయామం చేస్తే శరీరం వెచ్చగా, మరింత దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా తినే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సామర్థ్యం పెరుగుతుంది.(Pixabay)

Snana: చలికాలంలో బాగా వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదు. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని ఆయుర్వేదం సూచిస్తోంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల మీ చర్మం డీహైడ్రేట్ అవుతుంది. దీంతో మీ చర్మం మరింత పొడిగా, పగుళ్లు వచ్చేలా తయారవుతుంది. కాబట్టి బాగా వేడి నీరు కాకుండా లేదా చన్నీళ్ల స్నానం కాకుండా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం అన్నివిధాల శ్రేయస్కరం.

(5 / 7)

Snana: చలికాలంలో బాగా వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదు. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని ఆయుర్వేదం సూచిస్తోంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల మీ చర్మం డీహైడ్రేట్ అవుతుంది. దీంతో మీ చర్మం మరింత పొడిగా, పగుళ్లు వచ్చేలా తయారవుతుంది. కాబట్టి బాగా వేడి నీరు కాకుండా లేదా చన్నీళ్ల స్నానం కాకుండా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం అన్నివిధాల శ్రేయస్కరం.(Shutterstock)

Nasya: నస్య అంటే నాసిక రంధ్రాలలో ఔషధతైలం వేయడం. రాత్రి పడుకునే ముందు నాసిక రంధ్రాలలో రెండు, మూడు చుక్కల ఆయుర్వేద తైలం లేదా ఆవు నెయ్యి వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా తలనొప్పి, మైగ్రేన్లు, సైనస్, అలెర్జీలు, ముక్కు నుండి రక్తస్రావం, నాసికా మార్గాలు పొడిబారడం, జుట్టు రంగు మారడం, జుట్టు రాలడం, నిద్రలేమి మొదలగు సమస్యలు నివారించవచ్చు. ఈ నస్య చిట్కా ఉపయోగించడం ద్వారా చలికాలంలో నిద్ర బాగా పడుతుంది.

(6 / 7)

Nasya: నస్య అంటే నాసిక రంధ్రాలలో ఔషధతైలం వేయడం. రాత్రి పడుకునే ముందు నాసిక రంధ్రాలలో రెండు, మూడు చుక్కల ఆయుర్వేద తైలం లేదా ఆవు నెయ్యి వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా తలనొప్పి, మైగ్రేన్లు, సైనస్, అలెర్జీలు, ముక్కు నుండి రక్తస్రావం, నాసికా మార్గాలు పొడిబారడం, జుట్టు రంగు మారడం, జుట్టు రాలడం, నిద్రలేమి మొదలగు సమస్యలు నివారించవచ్చు. ఈ నస్య చిట్కా ఉపయోగించడం ద్వారా చలికాలంలో నిద్ర బాగా పడుతుంది.

Pad-abhyanga: నెయ్యి, నువ్వులు లేదా ఆవనూనెతో మీ పాదాలను మసాజ్ చేయడం వల్ల అరికాళ్లలో పగుళ్లను అరికట్టవచ్చు. ఈ చిట్కా మీ రక్తప్రసరణ మెరుగుపడుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

(7 / 7)

Pad-abhyanga: నెయ్యి, నువ్వులు లేదా ఆవనూనెతో మీ పాదాలను మసాజ్ చేయడం వల్ల అరికాళ్లలో పగుళ్లను అరికట్టవచ్చు. ఈ చిట్కా మీ రక్తప్రసరణ మెరుగుపడుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది.(Shutterstock)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు