Cervical Cancer | ఈ లక్షణాలతో జాగ్రత్త.. గర్భాశయ క్యాన్సర్ కావచ్చు!-do not ignore these symptoms as they may lead to cervical cancer
Telugu News  /  Photo Gallery  /  Do Not Ignore These Symptoms As They May Lead To Cervical Cancer

Cervical Cancer | ఈ లక్షణాలతో జాగ్రత్త.. గర్భాశయ క్యాన్సర్ కావచ్చు!

17 January 2022, 9:59 IST HT Telugu Desk
17 January 2022, 9:59 , IST

  • Cervical Cancer.. యోని దగ్గర మంట, అసాధారణ డిశ్చార్జ్, పొత్తి కడుపులో నొప్పి లేదంటే కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు గర్భాశయ క్యాన్సర్ సంకేతాలు కావచ్చు. సర్వికల్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా గుర్తించాలో డాక్టర్ పద్మా శ్రీవాస్తవ వివరిస్తున్నారు.

గర్భాశయం కింది భాగంలో, యోనికి అనుసంధానమయ్యే ప్రాంతంలో సర్వికల్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. లైంగిక చర్య ద్వారా మరొకరి నుంచి సంక్రమించే హ్యూమన్‌ పాపిల్లోమావైరస్‌ (హెచ్‌పీవీ) వల్ల చాలా అరుదుగా గర్భాశయ కణాలు.. క్యాన్సర్‌ కణాలుగా మారే ఛాన్స్‌ ఉంది. ఈ హెచ్‌పీవీని నిరోధించే వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల సర్వికల్‌ క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు. అసలు గర్భాశయ క్యాన్సర్‌ లక్షణాలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా గుర్తించాలన్న ముఖ్యమైన విషయాలను పుణెలోని మదర్‌హుడ్‌ హాస్పిటల్స్‌కు చెందిన గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ పద్మ శ్రీవాస్తవ వెల్లడించారు.

(1 / 7)

గర్భాశయం కింది భాగంలో, యోనికి అనుసంధానమయ్యే ప్రాంతంలో సర్వికల్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. లైంగిక చర్య ద్వారా మరొకరి నుంచి సంక్రమించే హ్యూమన్‌ పాపిల్లోమావైరస్‌ (హెచ్‌పీవీ) వల్ల చాలా అరుదుగా గర్భాశయ కణాలు.. క్యాన్సర్‌ కణాలుగా మారే ఛాన్స్‌ ఉంది. ఈ హెచ్‌పీవీని నిరోధించే వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల సర్వికల్‌ క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు. అసలు గర్భాశయ క్యాన్సర్‌ లక్షణాలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా గుర్తించాలన్న ముఖ్యమైన విషయాలను పుణెలోని మదర్‌హుడ్‌ హాస్పిటల్స్‌కు చెందిన గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ పద్మ శ్రీవాస్తవ వెల్లడించారు.(Shutterstock)

యోని భాగంలో మంట: తరచూ ఇలా యోని దగ్గర మంట వస్తుంటే.. మీరు కచ్చితంగా వైద్య నిపుణులను సంప్రదించాల్సిందే.

(2 / 7)

యోని భాగంలో మంట: తరచూ ఇలా యోని దగ్గర మంట వస్తుంటే.. మీరు కచ్చితంగా వైద్య నిపుణులను సంప్రదించాల్సిందే.

దుర్వాసన, అసాధారణ డిశ్చార్జ్‌: ఈ లక్షణాలను మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇది గర్భాశయ క్యాన్సర్‌ అయ్యే ప్రమాదం ఉంది.

(3 / 7)

దుర్వాసన, అసాధారణ డిశ్చార్జ్‌: ఈ లక్షణాలను మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇది గర్భాశయ క్యాన్సర్‌ అయ్యే ప్రమాదం ఉంది.(Shutterstock)

కడుపు ఉబ్బరం: ఇది కూడా సర్వికల్ క్యాన్సర్‌ లక్షణమే. తరచూ ఇలా కడుపు ఉబ్బరం వస్తుందంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు. ఇక పొత్తి కడుపులో నొప్పి కూడా గర్భాశయ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉన్నదని గుర్తించండి.

(4 / 7)

కడుపు ఉబ్బరం: ఇది కూడా సర్వికల్ క్యాన్సర్‌ లక్షణమే. తరచూ ఇలా కడుపు ఉబ్బరం వస్తుందంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు. ఇక పొత్తి కడుపులో నొప్పి కూడా గర్భాశయ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉన్నదని గుర్తించండి.(Shutterstock)

అలసట: ఎప్పుడూ అలసటగానే అనిపిస్తోందా? మీ రోజువారీ పనులను కూడా చేయలేకపోతున్నారా? వెంటనే డాక్టర్‌ను కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకోండి.

(5 / 7)

అలసట: ఎప్పుడూ అలసటగానే అనిపిస్తోందా? మీ రోజువారీ పనులను కూడా చేయలేకపోతున్నారా? వెంటనే డాక్టర్‌ను కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకోండి.(Pixabay)

మలంలో రక్తస్రావం, నొప్పి, లేదా విరేచనాలు: ఇవి కూడా సర్వికల్ క్యాన్సర్‌ లక్షణాలే అని గుర్తించండి.

(6 / 7)

మలంలో రక్తస్రావం, నొప్పి, లేదా విరేచనాలు: ఇవి కూడా సర్వికల్ క్యాన్సర్‌ లక్షణాలే అని గుర్తించండి.

శరీరంలో వాపు: చాలా మంది మహిళలు ఇది సాధారణమే అన్నట్లు లైట్‌ తీసుకుంటారు. కానీ అలా చేయడం చాలా ప్రమాదకరం. ఇది కూడా సర్వికల్‌ క్యాన్సర్‌ లక్షణమే. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి.. అవసరమైన పరీక్షలు చేయించుకోండి.

(7 / 7)

శరీరంలో వాపు: చాలా మంది మహిళలు ఇది సాధారణమే అన్నట్లు లైట్‌ తీసుకుంటారు. కానీ అలా చేయడం చాలా ప్రమాదకరం. ఇది కూడా సర్వికల్‌ క్యాన్సర్‌ లక్షణమే. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి.. అవసరమైన పరీక్షలు చేయించుకోండి.

ఇతర గ్యాలరీలు