LLC 2024 Live Streaming: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఈరోజు శిఖర్ ధావన్ వర్సెస్ దినేష్ కార్తీక్.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- LLC 2024 Live Streaming: లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024లో భాగంగా సోమవారం (సెప్టెంబర్ 23) గుజరాత్ గ్రేట్స్, సదరన్ సూపర్ స్టార్స్ తలపడనున్నాయి. శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్ ల నేతృత్వంలోని ఈ టీమ్స్ ఆడబోయే ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
- LLC 2024 Live Streaming: లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024లో భాగంగా సోమవారం (సెప్టెంబర్ 23) గుజరాత్ గ్రేట్స్, సదరన్ సూపర్ స్టార్స్ తలపడనున్నాయి. శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్ ల నేతృత్వంలోని ఈ టీమ్స్ ఆడబోయే ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
(1 / 5)
LLC 2024 Live Streaming: ప్రస్తుతం జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ తొలి మ్యాచ్ లో శిఖర్ ధావన్ సారథ్యంలోని గుజరాత్ గ్రేట్స్ సురేశ్ రైనా సారథ్యంలోని హైదరాబాద్ ను ఓడించింది. ధావన్ టీమ్ తర్వాతి మ్యాచ్ దినేశ్ కార్తీక్ సారథ్యంలోని సదరన్ సూపర్ స్టార్స్ తో జరగనుంది. ధావన్ సారథ్యంలోని గుజరాత్, కార్తీక్ సారథ్యంలోని సదరన్ సూపర్ స్టార్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
(2 / 5)
LLC 2024 Live Streaming: సెప్టెంబర్ 23న గుజరాత్ గ్రేట్స్, సదరన్ సూపర్ స్టార్స్ మ్యాచ్ జరగనుంది. జోధ్ పూర్ లోని బర్కతుల్లా ఖాన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
(3 / 5)
LLC 2024 Live Streaming: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లు భారత్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. గుజరాత్ గ్రేట్స్ వర్సెస్ సదరన్ సూపర్ స్టార్స్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు కామెంటరీలో ప్రసారం కానుంది. టోర్నమెంట్ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులు ఫ్యాన్ కోడ్ కు కూడా ఉన్నాయి. అందులోనూ ఆన్‌లైన్ లో ఈ మ్యాచ్ చూడొచ్చు.
(4 / 5)
LLC 2024 Live Streaming: సదరన్ సూపర్ స్టార్స్ టీమ్ ఇదే: దినేశ్ కార్తీక్ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్, శ్రీవత్స్ గోస్వామి, పార్థివ్ పటేల్, కేదార్ జాదవ్, పవన్ నేగి, హామిల్టన్ మసకడ్జా, చతురంగ డిసిల్వా, సురంగ లక్మల్, అబ్దుర్ రజాక్, హమీద్ హసన్, జీవన్ మెండిస్, రాబిన్ బిష్త్, జైస్లే కరియా, చిరాగ్ గాంధీ, మోను కుమార్, సుబోధ్ భాటి, ఎల్టన్ చిగుంబురా.
(5 / 5)
LLC 2024 Live Streaming: గుజరాత్ గ్రేట్స్ టీమ్ ఇదే: శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రీశాంత్, మహ్మద్ కైఫ్, లియామ్ ప్లంకెట్, లెండిల్ సిమన్స్, జెరెమీ టేలర్, అస్ఘర్ అఫ్గాన్, మోర్నే వాన్ వైక్, సమ్మర్ క్వాడ్రి, క్రిస్ గేల్, సీకుగె ప్రసన్న, షానన్ గాబ్రియేల్, సిబ్రాండ్, పరాస్ ఖడ్కా, కామౌ లెవెరాక్, యశ్పాల్ సింగ్, జాన్ మూనీ, మనన్ శర్మ, ఈశ్వర్ పాండే, దేబబ్రత దాస్.
ఇతర గ్యాలరీలు