
(1 / 5)
మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళం థ్రిల్లర్ మూవీ సైలెన్స్ తెలుగులో లాయర్ అరవింద్ పేరుతో రిలీజైంది. వీకే ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు. ఈ సినిమాలో పల్లవి పురోహిత్ హీరోయిన్‌గా నటించింది.

(2 / 5)
మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ సీబీఐ 5 మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో సీబీఐ ఆఫీసర్‌గా అద్భుత నటనను కనబరిచారు మమ్ముట్టి. ఈ సినిమా యూట్యూబ్‌లో సేమ్ టైటిల్‌తో రిలీజైంది.

(3 / 5)
మమ్ముట్టి, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన కసబ మూవీ రంగూన్ రౌడీ పేరుతో యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. నితిన్ రెంజీ ఫణిక్కర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

(4 / 5)
మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ డెరిక్ అబ్రహం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. తన తమ్ముడిపై పడిన నిందను ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా తొలగించాడనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు మార్కో ఫేమ్ హనీఫ్ అదేని దర్శకత్వం వహించాడు.

(5 / 5)
మమ్ముట్టి, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన వాసుకి మూవీ యూట్యూబ్‌లో తెలుగులో మిలియన్‌కుపైగా వ్యూస్‌ను రాబట్టింది. తనకు జరిగిన అన్యాయంపై ఓ మహిళ ఎలా ప్రతీకారం తీర్చుకుంది అన్నదే ఈ మూవీ కథ.
ఇతర గ్యాలరీలు