(1 / 7)
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మంజూరైన వాటిలో 1 లక్షా 23 వేల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. నిర్మాణ దశలను బట్టి నిధులను విడుదల చేస్తున్నారు.
(2 / 7)
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల నేపథ్యంలో ఇసుక, సిమెంట్, ఇనుము ధరలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తక్కువ ధరలకే లబ్ధిదారులకు అందించేలా చూడాలని నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వం ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తామని కూడా ప్రకటించింది.
(3 / 7)
తాజాగా ఈ స్కీమ్ కు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం సిమెంటు, స్టీల్, ఇటుక తదితర నిర్మాణ సామగ్రి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు సమావేశమై నిర్ణయించాలని నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన విడుదల చేశారు.
(4 / 7)
సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆదాయ వనరులను ప్రజలపై భారం లేకుండా పెంచేందుకు పలు కీలక అంశాలపై చర్చించారు. ఇసుక, స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి ధరలను నియంత్రించాలని నిర్ణయించారు. సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక విక్రయ కేంద్రాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
(5 / 7)
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 22,500 కోట్ల రూపాయిలతో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లను మంజూరు చేశారు. ఇందులో 1 లక్షా 23 వేల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి.
(6 / 7)
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లుల కోసం లబ్దిదారులు ఎదురు చూడాల్సిన పరిస్దితి లేకుండా ప్రతి సోమవారం నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకే నిధులను జమచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో పాటు జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతోంది.
(7 / 7)
పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన స్ధలాలను గుర్తించాలని వీలైనంత త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను రూపొందించనుంది.
ఇతర గ్యాలరీలు