AP TS Weather Updates : ఐఎండీ చల్లని కబురు - ఏపీకి తేలికపాటి వర్ష సూచన..!-latest imd weather updates of andhrapradesh and telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Latest Imd Weather Updates Of Andhrapradesh And Telangana

AP TS Weather Updates : ఐఎండీ చల్లని కబురు - ఏపీకి తేలికపాటి వర్ష సూచన..!

Mar 06, 2024, 12:18 PM IST Maheshwaram Mahendra Chary
Mar 06, 2024, 12:18 PM , IST

  • Today AP Telangana Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరగిపోతుండటంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ప్రజలకు ఉపశమనం కలిగించే వార్తను అందించింది ఐఎండీ. ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపింది.  
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

కొద్దిరోజులుగా ఏపీ తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పూర్తిస్థాయిలో సమ్మర్ ఎంట్రీ కాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

(1 / 6)

కొద్దిరోజులుగా ఏపీ తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పూర్తిస్థాయిలో సమ్మర్ ఎంట్రీ కాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.(unsplash.com)

మార్చి మొదట్లోనే తెలుగు రాష్ట్రాలపై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండల తీవ్రత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తు్న్నారు. ఏప్రిల్‌, మేలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

(2 / 6)

మార్చి మొదట్లోనే తెలుగు రాష్ట్రాలపై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండల తీవ్రత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తు్న్నారు. ఏప్రిల్‌, మేలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.(unsplash.com)

ఎండలు తీవ్రంగా ఉండగా ఏపీ వాసులకు చల్లని కబురు చెప్పింది వాతావరణశాఖ. ఉత్తర కోస్తాతో పాటు యానాంలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. అయితే ఎల్లుండి(మార్చి 08,2024)వ తేదీన పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 

(3 / 6)

ఎండలు తీవ్రంగా ఉండగా ఏపీ వాసులకు చల్లని కబురు చెప్పింది వాతావరణశాఖ. ఉత్తర కోస్తాతో పాటు యానాంలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. అయితే ఎల్లుండి(మార్చి 08,2024)వ తేదీన పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. (unsplash.com)

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో ఇవాళ, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండటంతో పాటు అధిక వేడి ఉంటుందని పేర్కొంది. వేడి, తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

(4 / 6)

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో ఇవాళ, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండటంతో పాటు అధిక వేడి ఉంటుందని పేర్కొంది. వేడి, తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.(unsplash.com)

ఇక తెలంగాణలో చూస్తే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉదయ పది గంటలు దాటితే చాలు భానుడి భగభగలు ఎక్కువ అవుతున్నాయి. ఈ వారం రోజులపాటు తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

(5 / 6)

ఇక తెలంగాణలో చూస్తే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉదయ పది గంటలు దాటితే చాలు భానుడి భగభగలు ఎక్కువ అవుతున్నాయి. ఈ వారం రోజులపాటు తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. (unsplash.com)

ఇక మంగళవారం తెలంగాణలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే.... భద్రాచలంలో 37.6 డిగ్రీలుగా నమోదైంది. మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్, నల్గొండలో 36 - 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక మంగళవారం హైదరాబాద్ సిటీలో చూస్తే.... బేగంపేట విమానాశ్రయం, హయత్ నగర్ ప్రాంతంలో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

(6 / 6)

ఇక మంగళవారం తెలంగాణలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే.... భద్రాచలంలో 37.6 డిగ్రీలుగా నమోదైంది. మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్, నల్గొండలో 36 - 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక మంగళవారం హైదరాబాద్ సిటీలో చూస్తే.... బేగంపేట విమానాశ్రయం, హయత్ నగర్ ప్రాంతంలో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. (unsplash.com)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు