Shani Trayodashi: ఈ ఏడాది చివరి శనిత్రయోదశి కనుక రేపు ఈ పనులు చేశారంటే 2025లో శని మిమ్మల్ని ఏమీ చేయలేడు!-last shanitrayodasi of this year if you do these things shani will not be able to do anything ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shani Trayodashi: ఈ ఏడాది చివరి శనిత్రయోదశి కనుక రేపు ఈ పనులు చేశారంటే 2025లో శని మిమ్మల్ని ఏమీ చేయలేడు!

Shani Trayodashi: ఈ ఏడాది చివరి శనిత్రయోదశి కనుక రేపు ఈ పనులు చేశారంటే 2025లో శని మిమ్మల్ని ఏమీ చేయలేడు!

Dec 27, 2024, 05:07 PM IST Ramya Sri Marka
Dec 27, 2024, 05:07 PM , IST

Shani Trayodashi: 2024 చివరి ప్రదోష వ్రతం డిసెంబర్ 28న అంటే  రేపు వచ్చింది. త్రయోదశి శనివారం నాడు వచ్చింది కనుక దీన్ని శని త్రయోదశి(శని మహా ప్రదోష వ్రతం) అని పిల్లుస్తారు.  ఈ రోజున కొన్ని పనులను చేశారంటే కొత్త ఏడాది శని భగవానుడి మీకు ఎలాంటి హాని కలిగించడని నమ్మిక. ఆ పనులు ఏంటో తెలుసుకుందాం

ప్రదోష ఆరాధన అనేది శివుని ఆరాధనలో ఒక ముఖ్యమైనది. దోషం అంటే నేరం. ప్రదోషం అంటే దోషరహితం. ప్రదోషం రోజున శివుడు విషం సేవించడం ద్వారా విశ్వాన్ని రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. కనుక ప్రదోష సమయంలో శివుడిని పూజించడం వల్ల చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అదే త్రయోదశి తిథి శనివారం వస్తే అది శని మహా ప్రదోషంగా మారి మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

(1 / 11)

శని మహా ప్రదోష సమయంలో శనివారాల్లో ఉపవాసం ఉండటం వల్ల 1000 రెట్లు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం. శనీశ్వరుడిని ఫలాలను ప్రసాదించేవాడిగా, న్యాయదేవతగా భావిస్తారు. ఈ ఉపవాసం ద్వారా శనిదేవుడి అనుగ్రహం పొంది వ్యక్తి  పాపాలు, దురదృష్టం తొలగిపోయి జీవితంలో శాంతి, సంతోషం, శ్రేయస్సును పొందుతాడు.

(2 / 11)

పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని కృష్ణపక్షం 13వ రోజున అంటే డిసెంబర్ 28న త్రయోదశి తిథి మొదలవుతుంది. అంటే రేపు తెల్లవారు జామున 02:26 గంటలు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 29 మధ్యాహ్నం 3:32 గంటలకు ముగుస్తుంది. ఈ రోజు శనివారం కాబట్టి దీనిని శని ప్రదోష వ్రతం అంటారు

(3 / 11)

శని ప్రదోష వ్రతం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఏలినాటి శని, శని దయ్యా వంటి దోషాలున్న వారు ఈ రోజు శని భగవానుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల విముక్తి లభిస్తుంది. అలాగే ప్రదోష వ్రతం శివునికి అంకితం చేయబడింది కాబట్టి, ఈ ఉపవాసం శివుని ఆశీర్వాదం పొందడానికి ఒక గొప్ప మార్గం. శని ప్రదోష వ్రతం రోజున శివలింగానికి జలాభిషేకం, శని భగవానుని ఆరాధన చాలా శుభప్రదమైనవి.

(4 / 11)

శని ప్రదోష రోజున శివలింగానికి స్వచ్ఛమైన నీరు, పాలు, తేనె సమర్పించడం చాలా ప్రత్యేకం. ముఖ్య బిల్వ పత్రాలు, శంఖు పువ్వులతో పూజించడం వల్ల గత జన్మల కర్మలు, పాపాలు తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఇది శివుడి అనుగ్రహాన్ని కలిగించడంతో పాటు శని దోషాన్ని శాంతింపజేస్తుంది.

(5 / 11)

శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులు, ఆవనూనె, ఇనుప పాత్రలు, దుప్పట్లు, నల్లని వస్త్రాలను దానం చేయండి. వీటిని దానం చేయడం వల్ల శని దోషం, దురదృష్టం తొలగిపోతాయి. శని భగవానుడి ప్రత్యేక అనుగ్రహం కూడా లభిస్తుంది.

(6 / 11)

శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులు, ఆవనూనె, ఇనుప పాత్రలు, దుప్పట్లు, నల్లని వస్త్రాలను దానం చేయండి. వీటిని దానం చేయడం వల్ల శని దోషం, దురదృష్టం తొలగిపోతాయి. శని భగవానుడి ప్రత్యేక అనుగ్రహం కూడా లభిస్తుంది.(Freepik )

శని ప్రదోష వ్రతం రోజున హనుమంతుడిని పూజించడం ఉత్తమం.ఈ రోజున హనుమంతుడి నామాన్ని జపించి బెల్లం, శనగలు సమర్పించడం మంచిది.హనుమంతుని అనుగ్రహం లభిస్తే శని బాధలు తొలగిపోతాయి.

(7 / 11)

శని త్రయోదశి రోజున ఇంట్లో శని యంత్రాన్ని ప్రతిష్టించి క్రమం తప్పకుండా పూజ చేయండి. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకువస్తుంది. శని గ్రహానికి సంబంధించిన దోషాలను తొలగిస్తుంది

(8 / 11)

శని ప్రదోషం రోజున రావిచెట్టు వేర్ల దగ్గర నీరు పోసి దీపం వెలిగించాలి. రావిచెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇది కాకుండా శని దేవుడి మంత్రాన్ని 21సార్లు పఠించండి. ఇది శని అనుగ్రహం పొందేందుకు దోహదపడుతుంది.

(9 / 11)

ఈ రోజున సాత్విక ఆహారం మాత్రమే తినండి. ఎలాంటి ఆల్కహాల్, మత్తు అలవాట్లు, మాంసాహారం తీసుకోకండి. శని అనుగ్రహానికి ఆటంకం కలిగించడం మాత్రమే కాదు ఆగ్రహానికి కారణమవుతుంది. శని దేవుడి ఆగ్రహిస్తే జీవితం చాలా కష్టంగా మారుతుంది. 

(10 / 11)

శనీశ్వరుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. ఈ రోజున నీలం రంగు దుస్తులు ధరించి శనీశ్వరుడికి నీలం రంగు పువ్వులను సమర్పించండి. ఇది మీ జీవితంలో శని ప్రభావాలను సానుకూలంగా మారుస్తుంది. 

(11 / 11)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు